EeVela Wednesday, September 30, 2026
Telangana /

TGPSC Exam Schedule 2026: అసిస్టెంట్ సైంటిస్ట్, AEE సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అసిస్టెంట్ సైంటిస్ట్, AEE, DEO, హెడ్ మాస్టర్ ఉద్యోగాల రాత పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో CBT విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న 4 కీలక నియామక పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB), రవాణా-రోడ్లు భవనాల శాఖ (R&B), పాఠశాల విద్యాశాఖలలోని పలు కేటగిరీల ఉద్యోగాలకు అక్టోబర్ మరియు నవంబర్ (2026) నెలల్లో రాత పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు:

TGPSC విడుదల చేసిన అధికారిక వెబ్ నోట్ ప్రకారం.. ఆయా పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టు పేరు (Post) ప్రభుత్వ శాఖ (Department) పరీక్ష తేదీ (Exam Date)
అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) 24 అక్టోబర్ 2026
అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) 26 అక్టోబర్ 2026
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (AEE – సివిల్) రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) 06 & 07 నవంబర్ 2026
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (DEO) / గెజిటెడ్ హెడ్ మాస్టర్ (గ్రేడ్-I) పాఠశాల విద్యాశాఖ (School Education Dept) 12 & 13 నవంబర్ 2026

అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్య విషయాలు:

  • ఈ నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలోనే నిర్వహించనున్నట్లు TGPSC స్పష్టం చేసింది.
  • పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను TGPSC అధికారిక వెబ్‌సైట్ (websitenew.tgpsc.gov.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • సెంటర్ల కేటాయింపు, పరీక్ష సమయాలు తదితర వివరాలను త్వరలో వెలువడే హాల్ టికెట్లలో పొందుపరుస్తారు. అభ్యర్థులు పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.