ముంబై: తన సహజసిద్ధమైన నటనతో, పద్ధతితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) తన వ్యక్తిగత విషయాలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ (KBC 18)లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ అమితాబ్ బచ్చన్ “మీ జీవిత భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, సాయి పల్లవి తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
సాయి పల్లవి చెప్పిన మైండ్ సెట్ ఇదే!
కాబోయే భర్త విషయంలో తనకు పెద్ద పెద్ద రిక్వైర్మెంట్లు ఏమీ లేవని, ముందుగా అతను ఒక మంచి మనిషి అయి ఉండాలని సాయి పల్లవి చెప్పారు.
-
కేవలం తన గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు కాకూడదని పేర్కొన్నారు.
-
తాను జీవితంలో ఏ స్థానంలో ఉన్నానో, ఏం చేస్తున్నానో తెలుసుకునే అవగాహన, ఆత్మపరిశీలన చేసుకునే తత్వం ఉండాలని తెలిపారు.
-
మనుషులన్నాక తప్పులు చేయడం సహజమని, అయితే ఆ పొరపాట్లను ఒప్పుకుని సరిదిద్దుకోవాలే తప్ప ఇతరులపై నిందలు వేసే రకం కాకూడదని స్పష్టం చేశారు.
ఆ ఒక్క పని వస్తే మరింత ప్లస్!
తన కాబోయే భాగస్వామికి ఈ లక్షణాలు ఉంటే చాలని చెబుతూనే.. “అతనికి వంట చేయడం కూడా వస్తే ఇంకా చాలా మంచిది” అని నవ్వుతూ సరదాగా చెప్పారు. దీంతో పక్కనే ఉన్న అమితాబ్ బచ్చన్‌తో పాటు ప్రేక్షకులు కూడా నవ్వులు పూయించారు. ప్రస్తుతం సాయి పల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.