Cyclone Arnab Live Updates: ఆంధ్రా తీరం వైపు దూసుకువస్తున్న తుఫాన్… లైవ్ అప్డేట్
Live updates
ఈ వార్తకు సంబంధించిన ప్రస్తుత పరిణామాలు...లైవ్
మరో “హుదూద్” కానుందా?
'ఆర్నాబ్' తుఫాన్ 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్ కంటే తీవ్రమైనదని నిపుణులు చెపుతున్నారు. అయితే హుదూద్ విశాఖ నగరం మీదుగా తీరాన్ని తాకడంతో తీవ్ర విద్వంసం జరిగింది. కానీ ఈసారి తీర నగరాలమీదుగా రాదనీ వారు చెపుతున్నారు.
విశాఖ తీరంలో అలల కల్లోలం
#CyclonArnab
Current situation at #Vizag beach.
Andhra Pradesh https://t.co/ceRszZ1Qv3— Devaloka | देवलोक (@Devalokaa) October 27, 2026
గంటకు 20 కిలోమీటర్ల వేగంతో … రేపు ఉదయం కోనసీమ తీరాన్ని తాకే అవకాశం
అర్నబ్ తుపాను దిశను నెమ్మదిగా మార్చుకుంటూ దూసుకువస్తుంది. గత 6 గంటలుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ముందుకు కదులుతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత గమనాన్ని బట్టి కాకినాడ, అంతర్వేది మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది.
తుపానుపై మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్
అర్నబ్ తుపాను దూసుకు వస్తున్న నేపథ్యంలో జల వనరులశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం అర్నబ్ తుపాను కోనసీమ మీదుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. . బుడమేరు, ఏలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బుడమేరు వాగులో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
క్రొత్త సమాచారం రాగానే మీకు అందిస్తాం