“తొందరగా పారిపోండి.. లేదంటే..”: అక్రమ బంగ్లాదేశీయులకు సువేందు హెచ్చరిక!

అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. “జల్దీ జల్దీ భాగో.. నహీ తో…” (తొందరగా పారిపోండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు) అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావంతో హకీంపూర్ సరిహద్దు వద్ద వందలాది మంది అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులు స్వచ్ఛందంగా తమ దేశానికి తిరుగు పయనమవుతున్నారు. దేశ భద్రతకు… ...

అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. “జల్దీ జల్దీ భాగో.. నహీ తో…” (తొందరగా పారిపోండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు) అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావంతో హకీంపూర్ సరిహద్దు వద్ద వందలాది మంది అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులు స్వచ్ఛందంగా తమ దేశానికి తిరుగు పయనమవుతున్నారు.

దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన ఈ అక్రమ చొరబాటుదారులను కేవలం హోల్డింగ్ సెంటర్లలో ఉంచడమే కాకుండా, వీలైనంత త్వరగా వారిని బంగ్లాదేశ్‌కు పంపేయాలని సువేందు ఆదేశించారు. చొరబాటుదారులకు ఇక్కడి వనరులను వినియోగించుకునే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎవరి వద్ద సరైన వీసా, పాస్‌పోర్ట్ వంటి పత్రాలు ఉండవో వారిని గుర్తించి ఈ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో పోలీసులకు దొరికిపోయి జైలు పాలవుతామనే భయంతో, అక్రమంగా నివసిస్తున్న వారంతా మూటాముల్లె సర్దుకుని సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో బంగ్లాదేశ్‌కు వెళ్లే మార్గాల్లో ఒకటైన స్వరూప్‌నగర్ సమీపంలోని ‘హకీంపూర్’ సరిహద్దు గేట్ వద్ద ఈ చొరబాటుదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. హకీంపూర్ సరిహద్దు వద్ద వందలాది మంది ఒక్కసారిగా గుమికూడటంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. తనిఖీలను ముమ్మరం చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించింది.

Join WhatsApp Channel