Snakes in Water Tank: వాటర్ ట్యాంక్ తెరిచి చూసిన కుటుంబానికి షాక్… లోపల ఏకంగా 27 పాము పిల్లలు!

హరిద్వార్: వేసవి కాలంలో నీటి కోసం వాటర్ ట్యాంక్‌లను తనిఖీ చేయడం, శుభ్రం చేయడం సాధారణమే. కానీ, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ కుటుంబానికి తమ ఇంటి వాటర్ ట్యాంక్ తెరిచి చూడగానే కళ్లు బైర్లుకమ్మాయి. అందులో ఒకటో, రెండో కాదు.. ఏకంగా 27 పాము పిల్లలు దర్శనమివ్వడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హరిద్వార్‌లోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్న… ...

హరిద్వార్: వేసవి కాలంలో నీటి కోసం వాటర్ ట్యాంక్‌లను తనిఖీ చేయడం, శుభ్రం చేయడం సాధారణమే. కానీ, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ కుటుంబానికి తమ ఇంటి వాటర్ ట్యాంక్ తెరిచి చూడగానే కళ్లు బైర్లుకమ్మాయి. అందులో ఒకటో, రెండో కాదు.. ఏకంగా 27 పాము పిల్లలు దర్శనమివ్వడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

హరిద్వార్‌లోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు, తమ ఇంటి పైభాగంలో ఉన్న సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి మూత తెరిచారు. ట్యాంక్ అడుగు భాగాన నీళ్లలో చిన్నపాటి పాము పిల్లలు పదుల సంఖ్యలో పాకుతూ ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. ఒక పెద్ద పాము ట్యాంక్ లోపలికి వెళ్లి గుడ్లు పెట్టి ఉంటుందని, అవి పొదిగి పిల్లలు బయటకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు, స్థానిక స్నేక్ క్యాచర్‌కు (Snake Rescuer) సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుంది. స్నేక్ క్యాచర్ అత్యంత జాగ్రత్తగా వాటర్ ట్యాంక్ లోపల ఉన్న మొత్తం 27 పాము పిల్లలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. వాటికి ఎలాంటి హాని కలగకుండా ఒక ప్లాస్టిక్ డబ్బాలో సురక్షితంగా బంధించారు. అనంతరం ఆ పాము పిల్లలన్నింటినీ జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. దీంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

పాము పిల్లలను బయటకు తీస్తున్న దృశ్యాలను అక్కడున్న వారు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒకేసారి 27 పాములను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వేసవిలో చల్లదనం కోసం పాములు నీడ ఉన్న ప్రాంతాలకు లేదా ఇలా నీటి కుంటలు, ట్యాంక్‌ల వద్దకు వస్తుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ ట్యాంక్ మూతలు ఎప్పుడూ గట్టిగా మూసి ఉంచాలని, లేదంటే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Join WhatsApp Channel