గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘విరోష్’ జంట.. ఆ రికార్డులు చూస్తే మైండ్ బ్లాంక్!

టాలీవుడ్ క్యూట్ కపుల్, మోస్ట్ లవబుల్ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (Vijay Deverakonda – Rashmika Mandanna) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వైవాహిక బంధంతో ఒకటైన ఈ జంట.. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా, కమర్షియల్ యాడ్స్ (Brand Endorsements) ద్వారా గ్లోబల్ స్థాయిలో సరికొత్త రికార్డులను… ...

టాలీవుడ్ క్యూట్ కపుల్, మోస్ట్ లవబుల్ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (Vijay Deverakonda – Rashmika Mandanna) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వైవాహిక బంధంతో ఒకటైన ఈ జంట.. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా, కమర్షియల్ యాడ్స్ (Brand Endorsements) ద్వారా గ్లోబల్ స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.

గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘మాన్యవర్’ (Manyavar) వెడ్డింగ్ యాడ్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ యాడ్ ఏకంగా 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి రికార్డులు తిరగరాసింది. అలాగే 104 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి, ప్రపంచంలోనే అత్యధిక లైక్స్ సాధించిన యాడ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం లేదా దరిదాపుల్లోకి వెళ్లడం ఎవరికైనా సాధ్యమా అనే స్థాయిలో ఈ బ్రాండ్ ప్రమోషన్ సక్సెస్ సాధించింది.

అయితే, తమ రికార్డుకు తామే పోటీ అన్నట్లుగా విజయ్-రష్మిక జంట మరోసారి అదరగొట్టారు. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) బ్రాండ్ యాడ్‌లో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనతికాలంలోనే ఈ వీడియోకు 9.1 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో గ్లోబల్‌గా అత్యధిక ఆదరణ పొందిన యాడ్స్ జాబితాలో మొదటి రెండు స్థానాలు ‘విరోష్’ (Virosh) జంటవే కావడం విశేషం.

వరుసపెట్టి గ్లోబల్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ కొల్లగొడుతున్న ఈ జంట క్రేజ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తమదైన కెమిస్ట్రీతో బ్రాండ్ వాల్యూను పెంచుతున్న ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ వైపు మరిన్ని ఇంటర్నేషనల్ సంస్థలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp Channel