స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు? మూడు పాయల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

భారతీయ సంప్రదాయంలో ప్రతి ఆచారానికీ, పద్ధతికీ ఒక పరమార్థం ఉంటుంది. అందులో స్త్రీల కేశాలంకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ (Fashion) పేరుతో రకరకాలుగా జుట్టును అలంకరించుకుంటున్నా, పూర్వకాలం నుంచి వస్తున్న ‘జడ’ ఆచారం వెనుక అద్భుతమైన సామాజిక, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా జడను మూడు పాయలుగానే ఎందుకు అల్లుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

జడల రకాలు – సామాజిక స్థితికి సంకేతాలు

పూర్వకాలంలో మహిళలు వారు వేసుకునే జడను బట్టి వారి వయసును, కుటుంబ స్థితిని సులభంగా గుర్తించేవారు. కేశాలంకరణ ప్రధానంగా మూడు రకాలుగా ఉండేది:

  • రెండు జడలు: వివాహం కాని బాలికలు రెండు జడలు వేసుకునేవారు. ఇది ‘జీవ’, ‘ఈశ్వర’ సంబంధాలు ఇంకా వేరువేరుగా ఉన్నాయనే దానికి సంకేతంగా భావించేవారు.
  • ఒక జడ: వివాహితలు ఒకే జడ వేసుకుంటారు. వివాహం తర్వాత జీవేశ్వరుల కలయికకు, అంటే భర్తతో కలిసి ఒకటై జీవిస్తున్నారని దీని అర్థం.
  • కొప్పు (ముడి): సంతానం కలిగి, ఇంటి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న స్త్రీలు కొప్పు వేసుకుంటారు. ఇది వారి పరిపక్వతకు నిదర్శనం.

జడకు మూడు పాయలే ఎందుకు?

జడ అల్లేటప్పుడు కేశాలను మూడు పాయలుగా విడదీసి అల్లడం మన సంప్రదాయం. కేవలం అందం కోసమే కాకుండా, ఈ మూడు పాయల వెనుక ఉన్న లోతైన అంతరార్థాలు ఇవే:

  • కుటుంబ బంధం: భార్య, భర్త మరియు సంతానం కలయికే సంతోషకరమైన కుటుంబం. ఈ మూడు పాయలు ఆ కుటుంబ బంధానికి ప్రతీక.
  • త్రిగుణాల కలయిక: మానవ ప్రకృతిలో ప్రధానంగా ఉండే సత్వ, రజో మరియు తమో గుణాల కలయికను ఈ పాయలు సూచిస్తాయి.
  • సృష్టి శక్తులు: జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అనే సృష్టిలోని మూడు మూల శక్తుల ఐక్యతకు ఈ మూడు పాయల అల్లిక నిదర్శనం.

జుట్టు విరబోసుకుంటే ఏమవుతుంది?

హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీలు జుట్టు విరబోసుకోవడాన్ని అరిష్టంగా భావిస్తారు. అలా కేశాలను వదిలేయడం అనేది దరిద్ర దేవత (జ్యేష్ఠాదేవి) కి ఆహ్వానంగా పెద్దలు చెబుతారు. జుట్టును చక్కగా ముడివేయడం లేదా జడ అల్లడం వల్ల సానుకూల శక్తి ఇంట్లో నెలకొంటుంది.

Join WhatsApp Channel