EeVela Wednesday, October 14, 2026
Andhra Pradesh /

AP ZP Chairman Reservations Finalized: ఏపీలో జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు – పూర్తి వివరాలు!

విజయవాడ / అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ప్రకటన అనంతరం, తాజాగా రాష్ట్రంలోని జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా రేపు ఉదయం 11.30గంటలకు విడుదల చేయనున్నారు.

రిజర్వేషన్ల కేటాయింపు వివరాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల జెడ్పీ చైర్మన్ స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మరియు మహిళా కేటగిరీలకు చట్టబద్ధ నిబంధనలకు లోబడి కేటాయించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ సమగ్ర కసరత్తు అనంతరం ఈ జాబితాను రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు సంబంధించి మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన స్థానాల వివరాలు వెలువడటంతో ఆయా జిల్లాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ల కేటాయింపులు
క్రమ సంఖ్య జిల్లా పేరు కేటాయించిన రిజర్వేషన్
1 అల్లూరి సీతారామరాజు ఎస్టీ
2 అనకాపల్లి బీసీ మహిళ
3 అనంతపురం బీసీ
4 అన్నమయ్య జనరల్
5 బాపట్ల జనరల్ మహిళ
6 చిత్తూరు జనరల్ మహిళ
7 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ ఎస్సీ మహిళ
8 తూర్పుగోదావరి జనరల్ మహిళ
9 ఏలూరు జనరల్ మహిళ
10 గుంటూరు ఎస్సీ మహిళ
11 కాకినాడ జనరల్ మహిళ
12 కృష్ణా జనరల్ మహిళ
13 కర్నూలు బీసీ
14 మార్కాపురం జనరల్
15 నంద్యాల జనరల్
16 ఎన్టీఆర్ ఎస్సీ
17 పల్నాడు జనరల్ మహిళ
18 పార్వతీపురం మన్యం ఎస్టీ
19 పోలవరం ఎస్టీ మహిళ
20 ప్రకాశం ఎస్సీ
21 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జనరల్
22 శ్రీ సత్యసాయి జనరల్
23 శ్రీకాకుళం బీసీ మహిళ
24 తిరుపతి ఎస్సీ మహిళ
25 విశాఖపట్నం బీసీ
26 విజయనగరం బీసీ మహిళ
27 పశ్చిమగోదావరి జనరల్
28 వైఎస్సార్ కడప జనరల్

 

ఎన్నికల బరిలోకి దిగేందుకు పార్టీల కసరత్తు

ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు కాగా, ఇప్పుడు జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు కూడా స్పష్టం కావడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ, బీజేపీలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నాయి. జెడ్పీ పీఠాలను కైవసం చేసుకునేందుకు నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.