విజయవాడ వరదల్లో ప్రజలకు భారీ నష్టం జరగడం ఖచ్చితంగా మానవ తప్పిదమే అని తెలుస్తోంది. ఒక మీడియా విలేఖరితో మాట్లాడిన వెలగలేరు డీఈ మాధవ్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.
“శనివారం ఉదయానికి బుడమేరు వాగు ప్రవాహం మామూలుగానే ఉంది. మధ్యాహ్న సమయానికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఆ ప్రవాహాన్ని అడ్డుకునే శక్తి అక్విడెక్ట్ కు ఉండదు. ప్రవాహం మరింత పెరుగుతుంది అని ముందే ఊహించాం.. శనివారం మధ్యాహ్నమే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాం. గేట్లు తెరవాల్సి వస్తుందని అధికారులకు సమాచారం ఇచ్చాం. 45వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గేట్లు ఎత్తుతాం.. నీళ్లు వదులుతున్నాం అని కూడా చెప్పాం” అని వెలగలేరు డీఈ మాధవ్ చెప్పడం సంచలనంగా మారింది.
ఇక్కడ గేట్లు ఎత్తిన 8-10 గంటల్లో నీరు విజయవాడకు చేరుతుంది అని ఆయన అన్నారు.
ఇదే నిజమైతే దాదాపు 12 గంటల పైగా సమయం ఉన్నప్పటికీ ప్రజలకు వివిధ మార్గాలలో హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదు అనే విషయం ప్రభుత్వం చెప్పాలి. విజయవాడ నగర ముంపుని నివారించక పోవచ్చేమో కానీ ప్రాణ నష్టం.. భారీ ఆస్తి నష్టాలను కాపాడే అవకాశం ఉండి కూడా అధికారులు ప్రజలను ఎందుకు అలర్ట్ చేయలేదో తెలియాల్సి ఉంది.