Janasena: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు షురూ

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా 2026 సంవత్సరానికి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు (Active Membership Registration) కార్యక్రమానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా (Accident Insurance) వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు… ...

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా 2026 సంవత్సరానికి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు (Active Membership Registration) కార్యక్రమానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా (Accident Insurance) వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా బాధిత కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది.

సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు రూ.500 రుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చు. జనసేన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా స్థానిక పార్టీ నాయకుల సహకారంతో సభ్యత్వాన్ని పొందే వెసులుబాటు కల్పించారు.

Join WhatsApp Channel