లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. గత 161 రోజులుగా తీహార్ జైల్ లో ఉన్న కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలతో కోర్టు పూర్తిగా ఏకీభవించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఈడీని తప్పు పట్టింది. విచారణ ముగిసినా గత అయిదు నెలలుగా జైల్ లో ఉంచడం సరికాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.
BRS MLC Kavitha: ఈడీ కేసులో కవితకు బెయిల్
Share this Article
![BRS MLC Kavitha: ఈడీ కేసులో కవితకు బెయిల్ BRS MLC Kavitha: ఈడీ కేసులో కవితకు బెయిల్](https://www.eevela.com/wp-content/uploads/2024/08/bail-to-kavitha.jpg)