డిల్లీ: దేశంలో ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్, ఐఈడీతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.జలమార్గాల ద్వారా తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. అలాగే రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. 26/11 ముంబయి దాడుల్లో కీలక కుట్రదారు అయిన తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
IB warns of possible Terror Attacks: దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు… నిఘా వర్గాల హెచ్చరిక
Share this Article
