Wayanad Landslides: అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితుల సహాయార్ధం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.

allu-arjun-wayanad
allu-arjun-wayanad

అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేస్తూ .. వాయనాడ్ సహాయక చర్యల కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు అల్లు అర్జున్ వెల్లడించారు. కేరళ ప్రజల భద్రత కోసం, ఈ కష్టకాలంలో వారు ధైర్యం పుంజుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

కేరళ ప్రజలు అల్లు అర్జున్ సినిమాలను బాగా ఆదరిస్తారు. టాలీవుడ్ నటులలోకెల్లా వారు అత్యంత ఇష్టపడే హీరో అల్లు అర్జున్. అక్కడి అభిమానులు ప్రేమగా మల్లు అర్జున్‌ అని పిలుస్తుంటారు.

ఇప్పటికే వివిధ సినీ నటులు తమ వంతు విరాళాలు ప్రకటించారు. హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు, మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Join WhatsApp Channel