Bigg Boss Telugu 8 : ఎప్పటి నుంచంటే.. ఇన్ని సీక్రెట్లా … కంటెస్టెంట్లు వీళ్ళే..

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో రిలీజ్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో ప్రేక్షకులు బిగ్‌బాస్ 8 ఎప్పుడా అని ఆసక్తిగా చూశారు. ఎట్టకేలకు ప్రోమో రిలీజ్ తో అందరికీ గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.

biggboss8telugu
biggboss8telugu

“మీరు ఎదురుచూస్తున్న, మేము ఎదురుచూస్తున్న అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ ఈజ్ బ్యాక్.. సీజన్ 8 లోగో మీ కోసం” అంటూ ఈ ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా. ఇక బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున అయితే చాలా డిఫరెంట్ గా ట్వీట్ చేశారు. “మీకోసం ఎంటర్టైన్మెంట్ తీకుసుకాస్తున్నాం.. సీజన్ 8 లోగో రిలీజ్ చేస్తున్నాం అనంతమైన ఫన్ మరియు వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా” అంటూ 8 అనే నంబర్ ని ఇన్ఫినిటీ లా కూడా చూడవచ్చు అని అర్ధం వచ్చేలా సీక్రెట్ చెప్పారు నాగ్.

ఇకపోతే, సీజన్ 8 లోగో వినూత్నంగా ఉంది. ముచ్చట గొలిపే రంగులతో వెరైటీగా డిజైన్ చేశారు. ఇక 8 నంబర్ మధ్యలో ‘స్టార్’ సింబల్ చూసి విశ్లేషకులు చాలా అర్ధాలు తీస్తున్నారు. గత తమిళ కన్నడ సీజన్ల మాదిరిగా రెండు హౌస్ లు ఇండే అవకాశం ఉంది అని.. బిగ్‌బాస్ తో పాటూ స్మాల్ బాస్ కూడా ఉండవచ్చు అని కొందరు విశ్లేషించారు.

బిగ్‌బాస్ తెలుగు 8 ఎప్పటి నుంచి అంటే …

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పటి నుంచి అనేదానిపై కూడా దాదాపు సస్పెన్స్ వీడినట్లే.. సాధారణంగా బిగ్‌బాస్ సెప్టెంబర్ లో మొదలవుతుంది. సీజన్ 8 కనుక సెప్టెంబర్ 8 న మొదలవ్వ వచ్చు అని తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో సీరియల్, బిగ్‌బాస్, జబర్దస్త్ సెలబ్రెటీలతో యాంకర్ అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది.. సెప్టెంబర్ 01 ఆదివారం నాటితో ముగియనుండగా.. ఆ తరవాతి ఆదివారం నుంచి ‘బిగ్ బాస్ 8’ ప్రారంభం అవుతుందేమో అనిపిస్తోంది.

కంటెస్టెంట్లు ఎవరు?

ఇక బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ పై కూడా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నా కొందరైతే పక్కా అని తెలుస్తోంది. వాళ్ళలో సీరియల్ నటి అంజలి పవన్, అక్షిత, రీతూ చౌదరి, యాంకర్ వర్షిణి, యాంకర్ వింధ్య విశాఖ, ఇంద్రనీల్, తేజస్విని గౌడ, యాదమ్మ రాజు పేర్లు ఇప్పటికే ఫైనల్ అయినట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వీరితో పాటు వేణుస్వామి, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్, సుప్రీత, సంచిక్ బబ్లూ, కుమారి ఆంటీ, ఏక్ నాథ్ హారిక జోడీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్, యాంకర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల్లో ఇంకొంతమంది పేర్లు బయటికి రావొచ్చు.

Join WhatsApp Channel