EeVela Wednesday, September 30, 2026
Andhra Pradesh / trending / World /

హోర్ముజ్ వద్ద అమెరికా దాడి.. వైజాగ్ మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ సహా ముగ్గురు భారతీయుల మృతి!


విశాఖపట్నం: ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ వద్ద జరిగిన దుర్ఘటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాణిజ్య నౌకలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి చెందిన యువ మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ (Patnala Suresh) ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న తమ కుటుంబ సభ్యుడు అకస్మాత్తుగా మరణించాడన్న వార్త తెలుసుకున్న సురేష్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషాద ఘటనతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అతని మృతికి నారా లోకేష్ సంతాపం వ్యక్తంచేశారు.