Shravana masam 2024: ఇక పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు… వందలకొద్దీ ముహూర్తాలు… వచ్చేస్తున్న శ్రావణ గడియలు

హైందవ సాంప్రదాయంలో పెళ్లి చేయాలంటే ఈడూ-జోడూ, జాతకాలు కలిస్తే సరిపోదు .. వారం, తిథి, నక్షత్రం.. సుముహూర్తం కూడా ఉండాలి.. జూన్ 19 నుంచి ఆషాడం .. తర్వాత అధిక శ్రావణం రావడంతో పెళ్ళి ముహూర్తాలకు బ్రేక్ పడింది .. దాదాపు రెండు నెలలపాటూ ఏటువంటి పెళ్లిళ్ళూ జరుగలేదు.. తెలుగు రాష్ట్రాలలో బాజా బజంత్రీలు మూగబోయాయి..

august-marriages
august-marriages

ఇప్పుడు ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం వచ్చేస్తోంది.. ఆగస్టు 7 నుంచి డీసెంబర్ వరకూ ఇక ఒకటే ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెపుతున్నారు. ఆగస్టులో తీసుకుంటే 7,8,9,10,11,13,15,17,18,20,22,23,24,28 తేదీల్లో కళ్యాణ గడియలు ఉన్నాయి.

ఈ తేదీల్లో వేలాది వివాహాలు తెలుగు రాష్ట్రాలలో జరుగనున్నాయి.. ఇప్పటికే అన్ని కళ్యాణ మండపాలూ బుక్ అయిపోయాయి. కొద్దిగా లేట్ గా బుకింగ్ కోసం వెళ్ళినవాళ్ళు మండపాలు దొరక్క తలలు పట్టుకున్నారు.. ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు.

Shravana masam 2024: ఇక పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు... వందలకొద్దీ ముహూర్తాలు... వచ్చేస్తున్న శ్రావణ గడియలు
Shravana masam 2024: ఇక పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు... వందలకొద్దీ ముహూర్తాలు... వచ్చేస్తున్న శ్రావణ గడియలు

అంతేకాదు ఆగస్టు నెలంతా సిటీల్లోని అన్ని ప్రముఖ హోటళ్ళూ బుక్ అయిపోయాయి.. ఇక ట్రైన్ టికెట్లు అయితే వెయిటింగ్ లిస్తే వందల్లో ఉంది.. ఇప్పుడైతే బస్ టికెట్లు కొన్ని ఖాళీగానే ఉన్నాయి.. కార్ ట్రావెల్స్, బస్సులు ఇప్పటికే చాలా బుక్ అయిపోయినట్లు చెపుతున్నారు.

అంటే రాబోయే రోజుల్లో బాజా బజంత్రీలతో దేశం దద్దరిల్ల బోతోందన్నమాట ..

Join WhatsApp Channel