రాజన్న సిరిసిల్ల జిల్లా నందు 2024 సంవత్సరములో కొత్తగా మంజూరైన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్, సిరిసిల్ల బ్రాంచ్ నందు ఈ క్రింద తెలిపిన ఉద్యోగులకు ఔట్సోర్సింగ్ ద్వారా నియమించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆఫ్ లైన్ ద్వారా తేది. 16-08-2024 నుండి తేది: 25-08-2024 వరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి, రాజన్న సిరిసిల్ల కార్యాలయములో అన్ని పనిదినములలో స్వీకరించబడును. ఉద్యోగ హోదా, విద్యార్హతల వివరము ఈ క్రింది విధముగా తెలపనైనది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు:
1. ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్: 01 పోస్టు
2. కోర్సు కో-ఆర్డినేటర్: 01 పోస్టు
3. ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 01 పోస్టు
4. ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్: 03 పోస్టులు
విభాగాలు : ఎస్సీ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్
అర్హత: ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టుకు 7వ తరగతి; ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ పోస్టుకు ఆపరేటర్ డిగ్రీ, పీజీడీసీఏ, లోయర్ గ్రేడ్ ఇంగ్లిష్/ తెలుగు టైప్ రైటింగ్ సర్టిఫికెట్; కోర్సు కో-ఆర్డినేటర్ పోస్టుకు ఏదైనా పీజీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం; ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్టుకు బీకాం లేదా ఎంబీఏతో పాటు పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
జీతం: నెలకు ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టుకు రూ.22,000. ఇతర పోస్టులకు రూ.31,000.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చిరునామాలో అందజేయాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 25, 2024
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి