సంక్రాంతి అంటే పిండివంటలు ప్రతీ ఇంట్లో ఉండాల్సిందే! ఇప్పటికే గత కొద్ది నెలలుగా ఆకాశాన్ని అంటుతున్న వంటనూనెల ధరలు కొద్ది రోజుల్లో మరింత ప్రియం కానున్నాయి. నవీ ముంబై వాశిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు నెలకు 7 నుంచి 8 టన్నుల నూనె దిగుమతి అవుతుంది. పండుగల సందర్భంగా డిమాండ్ పెరుగుతుండడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు దాదాపు 30 శాతం పెరిగాయని ఏపీఎంసీ వ్యాపారులు తెలిపారు.
కొద్ది నెలల క్రితం సోయాబీన్ ధరలు పెరగడంతోవాటి కట్టడికి కేంద్ర ప్రభుత్వం 20 శాతం దిగుమతి సుంకం విధించింది. అయినా ధరలు కంట్రోల్ కావడంలేదు.. రెండు నెలలుగా నిలకడగానే ఉన్న వంట నూనెల ధరలు పండుగ సీజన్ కావడంతో మళ్ళీ దూసుకు పోతున్నాయి. ఇప్పటికే లీటర్ నూనె 20 నుంచి 25 రూపాయలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.