చరిత్రలో ఎన్నడూ ఎరుగని వరదలు ఒక్కసారిగా విజయవాదను ముంచెత్తాయి. ఆగస్టు 31, శనివారం రాత్రి ఒక్కసారిగా నగరంపై బుడమేరు వాగు విరుచుకుపడి నగరానికి కోలుకోలేని దెబ్బ తీసింది.
ఇప్పడు వరద తగ్గుముఖం పడుతుండడంతో తేలుతున్న శవాలు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికి 47 మృతులుగా లెక్క తేల్చారు. నిన్నటికి 31 గా లెక్క తేలినా.. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
అయితే బుడమేరు ప్రవాహకప్రాతంలో ఎక్కువగా పేద, మధ్య తరగతి వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. అవి ఎక్కువగా సింగల్ ఫ్లోర్ ఇళ్ళు .. 100 లోపు గజాల ఇళ్ళు ఉన్నాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలో వారంతా ఏమయ్యారు.. ఇప్పటికీ మునకలో ఉన్న ఇళ్లలోని వారి ఆచూకీ ఏమిటి అనేది ముందు ముందు బయట పడుతుంది.
దీర్ఘకాలిక రోగులు, వృద్దులు, పిల్లలు, స్త్రీల ఆచూకీ తెలియడంలేదని ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. మరిన్ని వివరాలు రోజుల్లోనే తెలుస్తాయి.