బంగ్లాదేశ్ ప్రస్తుత సంక్షోభం వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలతో స్పష్టంగా తెలుస్తోంది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసినప్పటికీ ఆగని అల్లర్లు .. చివరకు ఆ దేశ సైన్యంపై కూడా తిరగబడుతున్న వైనం చూస్తే బంగ్లాదేశ్ ని పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలన్న పాక్ ఆలోచన అర్ధం అవుతోంది.. మొత్తం పరిణామాలు చూస్తే .
.
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ కోటా కల్పిస్తూ హసీనా తీసుకున్న నిర్ణయం ఇప్పటికే నిరీడయోగంతో సతమతమవుతున్న అక్కడి యువతను ఉద్యమించేలా చేసింది. అటు తర్వాత సుప్రీంకోర్టు డాన్ని 7 శాతానికి పరిమితం చేయగానే అల్లర్లు తగ్గుముఖం పట్టినా .. మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి.. నిజానికి ఆ దేశానికి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన వారిపట్ల సానుభూతి ఉండాలి.. కానీ పాక్ అనుకూల ఇస్లాం మూకల దన్నుతో ఉద్యమం తీవ్రరూపం దాల్చేలా చేశారు.
చివరికి షేక్ హసీనాతో రాజీనామా చేయించిన సైన్యం ఆమెను ప్రత్యేక విమానంలో భారత్ కు పంపింది. అయితే ఇప్పుడు అక్కడి ఉద్యమకారులు సైన్యంపై కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సైన్యం ఆమె పట్ల సానుభూతి చూపడం వారికి నచ్చడం లేదు.
ఈ ఉద్యమం ఇప్పుడు భారత్ వ్యతిరేక… హిందూ వ్యతిరేక ఉద్యమంలా కూడా మారుతోంది.. పలు హిందూ దేవాలయాలను ద్వంసం చేస్తున్నారు.. హిందూ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. ఉద్యమకారుల రూపంలో తీవ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు.. ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న కొందరికి పాకిస్తాన్ సైన్యాధికారులతో సంబంధాలు ఉండి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.