- రాష్ట్ర స్థాయి క్లస్టర్ వ్యవస్థగా మార్పు
- సచివాలయ ఉద్యోగుల్లో చాలామందిని పంచాయితీ రాజ్ శాఖకు బదిలీ
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జనసేన, బిజెపి కూడా భాగస్వాములు అయినా తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలే ప్రభుత్వ నిర్ణయాలు. అలాగే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోడానికి నిర్ణయించుకున్నా ముందుగా వాటిని బయట ప్రపంచానికి తెలిసేది ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా ద్వారా..
ఇకపోతే .. ఆంధ్రజ్యోతి (Andhrajyothy) అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తు వచ్చేది తెలుగుదేశం వాయిస్..ఆ పేపర్ లో కానీ, ABN చానల్ లో కానీ ఏదైనా వార్త వచ్చిందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు వాయిస్ అనే అందరీ భావిస్తారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ అనీ, ABN చానల్ లో గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ రద్దు అనీ వార్త వచ్చింది.
సచివాలయ ఉద్యోగుల్లో చాలామందికి సరైన పని లేదు అని, అసలు ఈ సచివాలయ వ్యవస్థ ఆలోచన వచ్చిందే చంద్రబాబుకి అని .. ఒకప్పుడు క్లస్టర్ వ్యవస్థ అనే ఆలోచన ఆయకు వచ్చిందే చంద్రబాబుకి అని.. ఈలోపు ప్రభుత్వం మారడంతో ఆయన చేయలేకపోయారు అని ఏబీఎన్ వివరించింది.
ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగుల్లో చాలామందిని పంచాయితీ రాజ్ శాఖకు పంపబోతున్నారు అని .. ఈ నిర్ణయం నిన్న వివిధ శాఖల అధికారులతో మరియు పొలిట్ బ్యూరో సమావేశంలో వివరించారు చెప్పింది ఆంధ్రజ్యోతి.