T3 సిరీస్ ఫోన్ల సిరీస్ లో తన నాలుగో మోడల్ ని వివో మంగళవారం (సెప్టెంబర్ 3) న మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. T3, T3x మరియు T3 లైట్ ల తర్వాత T3 ప్రో మరికొన్ని అదనపు ఫీచర్స్ తో వచ్చేస్తోంది. ఇది 8 GB RAM తో 128 GB మరియు 256 GB మెమొరీలతో రెండు వర్షన్ లలో వస్తోంది. 128 GB యొక్క ధర రూ. 24,999/- కాగా, 256 GB ధరను రూ. 26,999/- గా నిర్ణయించారు.
T3 ప్రో రెండు రంగుల్లో లభ్యమవుతుంది. ఒకటి ఎమరాల్డ్ గ్రీన్ కాగా, మరొకటి ఇసుకరాయి ఆరెంజ్. ఇక మూడో జెనరేషన్ స్నేప్ డ్రాగన్ 7 ప్రొసెసర్, సోనీ సెన్సార్ కలిగిన 50 మెగా పిక్సెల్ తో పాటూ 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 5500 mAH బ్యాటరీ లతో పాటూ వస్తోంది ఈ ముచ్చట గొలిపే ఫోన్.
ముఖ్యంగా చెప్పేది ఏంటో తెల్సా .. ఇది కేవలం 7.5 mm మందం కలిగిన అతి పలుచని ఫోన్ అని వివో కంపెనీ ప్రత్యేకంగా చెపుతోంది.
క్రొత్త ఫోన్ కొనే ఉద్దేశంలో ఉన్నవారు దీన్ని తప్పక మీ లిస్ట్ లో రాసుకోండి ..