Tamil Nadu Politics: డిప్యూటీ సీఎం పదవి కోసం వీసీకే డిమాండ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, చిన్న పార్టీలు ఇప్పుడు ‘కింగ్‌మేకర్’లుగా మారాయి. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేకు, వామపక్షాలు ...

  • అధికారంలో భాగస్వామ్యం కోరుతున్న వీసీకే.
  • తమ పార్టీకి చెందిన నేతకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్.
  • మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ ఈ డిమాండ్‌కు తలొగ్గుతారా?
  • కేవలం మద్దతు మాత్రమే కాకుండా, కీలక శాఖల కేటాయింపుపై చర్చలు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, చిన్న పార్టీలు ఇప్పుడు ‘కింగ్‌మేకర్’లుగా మారాయి. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేకు, వామపక్షాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. అయితే, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన పూర్తి బలం రావాలంటే వీసీకే మద్దతు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో, కేవలం బయటి నుంచి మద్దతు ఇవ్వడం కాకుండా, నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని వీసీకే నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Join WhatsApp Channel