కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా వంటి పథకాల గురించి వివరిస్తూ, గడిచిన పదేళ్ల కాలంలో భారత వృద్ధిని, పురోగతిని సాధించిన విషయాలను వివరించారు. పేదల అభివృద్దే, దేశ అభివృద్ధి అని చెప్పిన ఆర్థిక మంత్రి, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాధ్యమవుతుందన్న నిర్మలా సీతారామన్ మౌలిక సదుపాయాల పెరుగుదలలో గణనీయంగా వృద్ధిని సాధించినట్టు పేర్కొన్నారు.

ప్రధానంగా వివిధ విభాగాలకు కేటాయింపులు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • రక్షణ రంగం: రూ 6.2 లక్షల కోట్లు
  • ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ. 2.78 లక్షల కోట్లు
  • రైల్వే: రూ.2.55 లక్షల కోట్లు
  • వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు
  • హోం శాఖకు: రూ.2.03 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ది: రూ.1.77లక్షల కోట్లు
  • రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు
  • కమ్యూనికేషన్లు: రూ.1.37 లక్షల కోట్లు
  • వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు

గురువారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కేవలం 58 నిమిషాల్లో ముగించారు. ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి చిన్నది.

నిర్మలమ్మ గత బడ్జెట్‌ల ప్రసంగ సమయాలు

2019 -2 గంటల 17 నిమిషాలు (137 నిమిషాలు)

2020 -2 గంటల 40 నిమిషాలు (160 నిమిషాలు)

2021 -1 గంట 50 నిమిషాలు (110 నిమిషాలు)

2022 -1 గంట 33 నిమిషాలు (93 నిమిషాలు)

2023 -1 గంట 27 నిమిషాలు (87 నిమిషాలు)

2024 – 58 నిమిషాలు

Join WhatsApp Channel