Narendra Modi: ‘ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేయండి’.. మంత్రుల మండలి సమావేశంలో కీలక ఆదేశాలు!

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, దేశీయంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో తన పూర్తి స్థాయి మంత్రుల మండలి సమావేశాన్ని నిర్వహించారు. సుమారు కొన్ని గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో.. దేశంలో ఆర్థిక సంస్కరణల అజెండాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని… ...

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, దేశీయంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో తన పూర్తి స్థాయి మంత్రుల మండలి సమావేశాన్ని నిర్వహించారు. సుమారు కొన్ని గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో.. దేశంలో ఆర్థిక సంస్కరణల అజెండాను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, దాని కారణంగా అంతర్జాతీయంగా తలెత్తుతున్న గడ్డు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గల్ఫ్ సంక్షోభం కారణంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడం, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, చమురు బిల్లులు భారమవ్వడం వంటి అంశాలపై ప్రభుత్వం నిశిత నిఘా ఉంచింది.

ఈ సంక్షోభాన్ని పర్యవేక్షించేందుకు మరియు తగిన చర్యలను సూచించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి ‘అధికారికేతర మంత్రుల బృందాన్ని’ (Informal Group of Ministers) ఏర్పాటు చేసారు.

సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ.. గత ఏడాది GST వ్యవస్థలో చేసిన మార్పుల వంటి ఆర్థిక సంస్కరణలను నిరంతరం కొనసాగించాలని ఉద్ఘాటించారు. కేవలం ప్రస్తుత అవసరాలకే పరిమితం కాకుండా, 2026 సంవత్సరం దాటి కూడా దేశంలో అమలు చేయాల్సిన దీర్ఘకాలిక సంస్కరణల కోసం ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు.

సమావేశంలో కీలక రంగాలకు చెందిన పలు మంత్రిత్వ శాఖలు తమ నివేదికలను సమర్పించాయి:

Join WhatsApp Channel