Andhra Pradesh Anna Canteen Daily Menu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభం అవుతున్నాయి. మొత్తం 203 క్యాంటీన్లలో రేపటి నుంచి 100 క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ 5నాటికి మరో 80 వరకు క్యాంటీన్లు ప్రారంభం అవుతాయి.
రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. అలాగే మిగతా 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఈ అన్న క్యాంటీన్లలో ఆహారం తయారీ, సరఫరా బాధ్యతలకు పిలిచిన టెండర్లను హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ దక్కించుకుంది.
అయితే అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందించడం కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఆదివారం తప్ప మిగతా అన్నిరోజుల్లోనూ క్యాంటీన్లు తెరిచి ఉంటాయి. కేవలం రూ.5కే టిఫిన్, భోజనం అందిస్తారు.
అన్న క్యాంటీన్ల మెనూ
ఇక అన్న క్యాంటీన్లలో రోజూ వారీ టిఫిన్, భోజనం మెనూ విడుదల చేశారు. ప్రతీరోజూ ఒకే వెరైటీ కాకుండా అనేక రకాల టిఫిన్లు, కూరలు అందిస్తారు. మెనూ చూస్తే ..
సోమవారం మెనూ
బ్రేక్ ఫాస్ట్ రూ.5
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
లంచ్/డిన్నర్ రూ.5
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
మంగళవారం మెనూ
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి
బుధవారం మెనూ
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు పచ్చడి
గురువారం మెనూ
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి
శుక్రవారం మెనూ
బ్రేక్ పాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
లంచ్/డిన్నర్ట్ రైస్, కూర, పప్పు/
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
శనివారం మెనూ
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి
అన్న క్యాంటీన్ల టైమింగ్స్ .. ఆహార పరిమాణం
టైమింగ్స్ విషయానికి వస్తే, బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు … లంచ్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు … డిన్నర్ రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
ఆహార పరిమాణం విషయానికి వస్తే .. ఇడ్లీ, పూరి-3, ఉప్మా, పొంగల్-250 గ్రాములు, వైట్ రైస్ – 400 గ్రాములు, చట్నీ/పొడి – 15 గ్రాములు, సాంబారు- 150 గ్రాములు, మిక్చర్ – 25 గ్రాములు, కూర – 100 గ్రాములు, పప్పు/సాంబారు – 120 గ్రాములు, పెరుగు- 75 గ్రాములు అందిస్తారు.