World Yogasana Championship 2026: 102 స్వర్ణాలతో భారత్ క్లీన్ స్వీప్!

అహ్మదాబాద్: భారత్‌లో జన్మించిన యోగాకు ఇప్పుడు క్రీడా రూపం (Sports) రాగా, అందులోనూ మన అథ్లెట్లు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని ఈకేఏ (EKA) అరేనా వేదికగా జరిగిన ‘తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్-2026’ లో ఆతిథ్య భారత్ అద్భుత ప్రదర్శనతో క్లీన్ స్వీప్ చేసింది. జూన్ 4 నుంచి 8 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఈ… ...

అహ్మదాబాద్: భారత్‌లో జన్మించిన యోగాకు ఇప్పుడు క్రీడా రూపం (Sports) రాగా, అందులోనూ మన అథ్లెట్లు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని ఈకేఏ (EKA) అరేనా వేదికగా జరిగిన ‘తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్-2026’ లో ఆతిథ్య భారత్ అద్భుత ప్రదర్శనతో క్లీన్ స్వీప్ చేసింది.

జూన్ 4 నుంచి 8 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీలో భారత యోగా అథ్లెట్లు ఏకంగా 102 స్వర్ణ పతకాలతో (Gold Medals) పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో 79 దేశాలకు చెందిన మొత్తం 522 మంది అథ్లెట్లు పోటీ పడగా, అందులో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత్ మొత్తం 114 పతకాలు సాధించింది. ఇందులో 102 స్వర్ణాలు ఉండటం విశేషం.

జపాన్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలతో పట్టికలో చాలా వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఒకే అథ్లెట్ (నబిలా బర్రాజా) రెండు స్వర్ణాలు గెలవడంతో అర్జెంటీనా మూడో స్థానం దక్కించుకుంది. పొరుగు దేశం నేపాల్ ఏకంగా 52 పతకాలు (1 స్వర్ణం, 36 రజతం, 15 కాంస్యం) గెలుచుకుని ఐదో స్థానంలో నిలవగా, ఉజ్బెకిస్తాన్ 25 పతకాలతో ఆకట్టుకుంది.

Join WhatsApp Channel