కొద్ది రోజుల క్రితం హార్మూజ్ జలసంధి వద్ద ఒమాన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న భారతీయులున్న నౌకలను అమెరికా టార్గెట్ చేసింది. మూడు నౌకలపై మిస్సైళ్ల దాడి చేయగా అందులో ఉన్న ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ వివాదాల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా జీ7 దేశాల నాయకులు కుర్చుని ఉన్న సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సముద్ర రవాణా సురక్షితంగా ఉండేలా, నావికులు నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేలా అన్ని దేశాలు తప్పనిసరిగా నిర్ధారించాలని అన్నారు.
“సంఘర్షణలకు పరిష్కారాలు కేవలం చర్చలు, దౌత్యం మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే లభిస్తాయని భారతదేశం గట్టిగా విశ్వసిస్తుంది… భారతదేశంలో మనం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తాము. మనం దాత-పురపాలక మనస్తత్వాన్ని అధిగమించి సమాన భాగస్వాములుగా వ్యవహరించాలి.” అని ప్రపంచదేశాలకు నొక్కి చెప్పారు.
‘మనం కేవలం ఒకరి పక్కన ఒకరు నిలబడటమే కాకుండా, కలిసి ప్రయాణించాలి. సంబంధాలు గౌరవం మీద ఆధారపడి ఉండాలి, పరాధీనత మీద కాదు. శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, నీటి వనరులు, వ్యవసాయం, ఇంధనంపై దృష్టి సారించడం కూడా ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు అందించడంలో సహాయపడుతుంది’ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
జి7 శిఖరాగ్ర సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కూడా హాజరయ్యారు.



