వారం రోజులుగా దుబాయిలో కురుస్తున్న భారీ వర్షాలు ఆ నగరాన్ని అతలాకుతలం చేశాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాలను తట్టుకునే యంత్రాంగం లేని యుఎఇ అధికారులు పరిస్థితులను చక్కదిద్దడానికి ఇంకా 24 గంటలూ పనిచేస్తూనే ఉన్నారు.
ఈ సందర్భంలో యుఎఇలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే భారతీయ ప్రయాణీకులకు సూచనలు జారీ చేసింది. పరిస్థితి చక్కబడే వరకు అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది .
మరో 24 గంటల్లో తిరిగి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
“దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ పౌరులకు సహాయం చేయడానికి, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 17 నుండి అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను అందుబాటులో ఉంచింది” అని ప్రకటనలో ఎంబసీ తెలిపింది.
ఫోటో క్రెడిట్: రాయిటర్స్