తాజా వార్తలు
- యుద్దంలో అడుగుపెట్టబోతోన్న అమెరికా .. రష్యా కూడా ఎంటరైతే ఇక మూడో ప్రపంచ యుద్దమే
- ఇజ్రాయెల్ కు 80% గ్యాస్ సరఫరా అయ్యే గ్యాస్ రిగ్గులను ద్వంసం చేసిన ఇరాన్ ..??
- మృతులు వందల్లో ??
- పరిస్థితిని తీవ్రంగా తీసుకున్న ఇజ్రాయెల్.
- ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సన్నాహాలు.
అమెరికా ముందుగా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులకు దిగింది. ఇది పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అలర్ట్ అయినా .. ఒక్కసారిగా వందలకొద్దీ దూసుకువస్తున్న కొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకినట్లు సమాచారం.
ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది..
İran tarafından ateşlenen balistik füzeler an itibari ile İsrail üzerine düşüyor.#İran İsrail #TelAviv #Nato #Savaş #Ortadoğu #Warrior pic.twitter.com/US9BO3Ib9V
— Kim Wexler (@AvWexler) October 1, 2024
కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ మట్టుపెట్టిన హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.