Nothing (2a) Plus Phone: 50MP డ్యూయల్ కెమెరా.. ఫాస్ట్ ఛార్జింగ్.. వచ్చేస్తోంది జులై 31న .. ధర ఎంతంటే!

Photo of author

Eevela_Team

Share this Article

ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ఫోన్ కంపెనీ ఏది అంటే.. నథింగ్ అని టక్కున చెప్పేస్తున్నారు నేటి యువత. అధ్బుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకున్న నథింగ్ 2A ఫోన్ భారత్ మార్కెట్లోకి మార్చి 2024 న అడుగుపెట్టింది. దాదాపు రూ. 23999 ధరలో లభ్యమవుతున్న ఈ మొబైల్ యూజర్లు తదుపరి మోడల్ ఎప్పుడా అని ఎదురు చూశారు..

నథింగ్ కంపెనీ శుభవార్త చెప్పింది.. ఆ ఫోన్ యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్ Nothing (2a) Plus ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

nothing-2a-plus
nothing-2a-plus

Nothing Phone (2a) Plus ఫీచర్స్ ఇవే

ముఖ్యంగా నథింగ్ 2A లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా (2a) Plus లో మొత్తం 50MP డ్యూయల్ కెమెరాలతో ఉంది. అయితే కొన్ని ఫీచర్లు 2A ప్లస్ కన్నా 2A లోనే బాగా ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే ..

డిస్ప్లే : రెండు మోడల్స్ ఒకేలా 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ని కలిగి ఉన్నాయి.

ప్రాసెసర్ విషయానికి వస్తే: 2A లో MediaTek Dimensity 7200 Pro చిప్‌సెట్‌ వాడగా 2A ప్లస్ లో 7300 చిప్‌సెట్‌ వాడారు.

కెమెరా: నథింగ్ ఫోన్ (2a)ప్లస్ లో OIS + EISతో 50MP ప్రైమరీ కెమెరా మరియు 50MP అల్ట్రా-వైడ్ కెమెరాను ఉంచారు అయితే 2Aలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరాకు 32MP మాత్రమే ఇచ్చారు.

బ్యాటరీ: నథింగ్ ఫోన్ (2A) ప్లస్ లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,050mAh బ్యాటరీని అందిస్తున్నారు.

OS: నథింగ్ OS 2.5 తో పాటూ Android 14 వెర్షన్ ఆధారంగా రూపొందించ బడ్డాయి.

ధర ఎంతంటే ..

భారత మార్కెట్ లో దాదాపు 30,000 రూపాయల ధరలో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇస్తున్న ఫీచర్స్ తో పోల్చుకుంటే ఆదేమీ ఎక్కువేమీ కాదంటున్నారు విశ్లేషకులు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel