ఒక పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లో వేరే పార్టీ అభిమానులు వ్యతిరేక కామెంట్లు చేయడం సాదారణంగా జరిగేదే. అయితే అదే పార్టీ అభిమానులు వారి అధికారిక అకౌంట్ పై ట్రోలింగ్ చేయడం మాత్రం ఇప్పుడే సాధ్యమైంది.
ఎలా అంటారా.. నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ధారుణంగా ఓటమి చవిచూసింది. అయితే జ్యోతిష్కుడు వేణుస్వామి ఎప్పుడో సన్ రైజర్స్ గెలుస్తుంది అని చెప్పినట్లు గా యూట్యూబ్ థంబ్నెయిల్ ఒకటి స్కీన్ షాట్ తెలుగుదేశం అధికారిక ఖాతాలో షేర్ చేసి That’s it. That is the tweet. అని మాత్రం రాశారు.
దీనితో ఆ పార్టీ అభిమానులు ఆ ట్వీట్ పై విరుచుకు పడ్డారు . పార్టీ అధికారిక ఖాతాలో ఇలాంటి చెత్త పోస్టులు ఎలా చేస్తారని కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే .. అదే వేణుస్వామి జగన్ ఈ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడు అని చెప్పడం. దానికీ దీనికీ లింకు పెట్టి అది జరగలేదు కనుక ఇదీ జరుగదు అని అర్ధం వచ్చేలా ట్వీట్ తయారు చేశారన్నమాట..
That's it. That is the tweet.#EndOfYCP #AndhraPradesh pic.twitter.com/xjXtLwcNIC
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2024