త్వరలో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుని టిడిపి వదిలించుకోబోతుందా? ఆయనను పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం చేస్తోందా? అవుననే అనిపిస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు..
అంబేద్కర్ బేనర్ స్వయంగా తొలగించడమే కాక.. దళితులపై, మైనారిటీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న RRR గా పిలవబడే రఘురామ కృష్ణంరాజుపై తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన చేతలను, వ్యాఖ్యలను ఖండించడమే కాక ఆయన ప్రవర్తిస్తున్న తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. దళితులను టిడిపికి దూరం చేసేలా రఘురామ కృష్ణంరాజు ప్రవర్తిస్తున్నారని.. ఆయన చేరిక వల్ల టిడిపికి ఎటువంటి ఉపయోగం జరగలేదు అని.. శకునిలా పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని విమర్శించారు.
తన యూట్యూబ్ చానల్ అయిన మహాసేన మీడియా ద్వారా కొన్ని వీడియోలు చేస్తూ ఆయన్ని కుట్రదారుడిలా అభివర్ణించారు. దళితులను టిడిపి నుంచి దూరం చేసి వైసీపీకి దగ్గర చేసేలా ఆయన ప్రవర్తన ఉంటోంది అని. ఏనాడూ చంద్రబాబు కోసం కానీ .. లోకేష్ కోసం కానీ ఆయన ఏనాడూ తిరగలేదు అని.. కేవలం తనపై జగన్ ప్రభుత్వం చేసిన దాడులు, కేసుల కోసం మాత్రమే ఆయన పోరాటాలు చేశారని అన్నారు.
ఈయనకు ఇగో ఉంది అని .. మీకు మంత్రి పదవి రాలేదని గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో తెలుగుదేశంపై విమర్శలు కూడా చేశారు అని గుర్తు చేశారు.
మొత్తంగా చూస్తే లోకేష్ కు వీర విధేయుడైన మహాసేన రాజేష్ అధిష్టానం అనుమతి లేకుండా ఇలా రఘురామ కృష్ణంరాజుపై విమర్శలు చేసే అవకారం లేదు అని.. పార్టీ పరంగా ఆయనను దూరం పెట్టే ప్రయత్నం జరిగుతోంది అని విశ్లేషకుల అంచనా …