వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి, మాజీ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి వైసీపీని వీడినట్లే కనిపిస్తుంది. ఈరోజు ఆమె తన సోషల్ మీడియా x ఖాతా ప్రొఫైల్ నుంచి వైసీపీ ని తొలగించారు. దీనితో ఆమె వైసీపీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ఏ పార్టీలో చేరే అవకాశం లేదు. దీనికి కారణం ఆమె గతంలో టిడిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల లను ధారుణంగా ధూషించారు. ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం కూడా ఆమె అవినీతి చిట్టాను బయటికి తీసే పనిలో ఉంది. దీనితో గత ఎన్నికల్లో ధారుణ ఓటమి అనంతరం ఆమె రాష్ట్రాన్ని వీడారు.
ఇటీవలే తమిళ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీ పెట్టారు. బహుశా రోజా తమిళ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని.. త్వరలో టీవీకే పార్టీలో చేరబోతున్నారని.. ఇప్పటికే ఆమె భర్త సెల్వమణి విజయ్ తో టచ్ లో ఉన్నట్లు కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వస్తున్నాయి.
చూడాలి మరి ఆరవ రాజకీయాల్లో ఆమె ఎలా రాణిస్తారో .. కాలమే నిర్ణయించాలి.