వారణాసి: 2024 లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధి అమేధీ నుంచే పోటీ చేస్తారని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు.
ప్రియాంక గాంధి అమేధీ నుంచి పోటీ చేయ్యబోతున్నరనే వార్తలను ఆయన ఖండిస్తూ ప్రియాంక వేరే ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. పిసిసి చీప్ గా అజయ్ రాయ్ నిన్ననే నియమితులయ్యారు.
ఇలా ఉండగా, కొద్దిరోజుల క్రితం ప్రియంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ ప్రియాంక అమేధీ నుంచి లేదా సుల్తాన్ పూర్ నుంచి లోక్ సభకు పోటీచేయనున్నారని చెప్పారు.