ఈరోజు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ “సిద్ధం” సభ జరిగింది. ఈ సభకు రాయలసీమ వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సుమారు పదిలక్షల మంది సిద్ధం సభకు వచ్చినట్లు అంచనా. దక్షిణ భారతదేశంలో ఇంతమంది హాజరైన రాజకీయ సభ ఇప్పటిదాకా జరగలేదు. ఇది నిజంగా ఒక రికార్డే!
అలాగే ఈ సభలో జగన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ లో ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా వీక్షించారు. ఇది కూడా ఇండియాలో ఒక రికార్డే! జగన్ ప్రసంగిస్తున్న సమయంలో సాక్షి, టీవి9, ఎన్టీవీ లలో కలిపి లక్షా పది వేల మంది యూట్యూబ్ లో ప్రత్యక్షంగా చూశారు.
ఇక ట్విటర్ లో #Siddam, #YSJaganAgain టాగ్ లు దేశంలో ట్రెండింగ్ లో నిలిచాయి. సోషల్ మీడియా మొత్తం రాప్తాడు సభ ఇమేజ్ లు, వీడియోలతో నిండి పోయింది.
కాగా జగన్ దాదాపు 70 నిమిషాల సేపు సుధీర్ఘ ప్రసంగం చేశారు. దీనిలో 50 నిమిషాలు తన ప్రభుత్వ పథకాలు, విజయాలు కోసం చెపితే 20 నిమిషాలు ప్రతిపక్షాలను, ముఖ్యంగా టిడిపిని తూర్పారబట్టారు.
మన @YSRCParty కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా…
అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా…
ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం. కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు!#Siddham pic.twitter.com/wny9gwiYnj
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024
Over 10 lakh people attended today #Siddam meeting in Anantapur. #YSRCPSOCIALMEDIA #YSRCongressParty#YSJagan #Siddam #YSRCPAgain #RaptaduSiddham#Raptadu @DrPradeepChinta pic.twitter.com/A2xLDm9Zyw
— ₥₳ⱧɆ ⱤɆĐĐɎ (@IamMahe2021) February 18, 2024