డిగ్రీ చదివారా? అయితే LICలో భారీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన LIC Housing Finance Limited (LIC HFL) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 200 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 14.08.2024 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు …

పోస్టుల ఖాళీల సంఖ్య
| రాష్ట్రం | ఖాళీల సంఖ్య |
| ఆంధ్రప్రదేశ్ | 12 |
| అస్సాం | 5 |
| ఛత్తీస్‌గఢ్ | 6 |
| గుజరాత్ | 5 |
| హిమాచల్ ప్రదేశ్ | 3 |
| జమ్మూ మరియు కాశ్మీర్ | 1 |
| కర్ణాటక | 38 |
| మధ్యప్రదేశ్ | 12 |
| మహారాష్ట్ర | 53 |
| పుదుచ్చేరి | 1 |
| సిక్కిం | 1 |
| తమిళనాడు | 10 |
| తెలంగాణ | 31 |
| ఉత్తర ప్రదేశ్ | 17 |
| పశ్చిమ బెంగాల్ | 5 |
| మొత్తం | 200 |
విద్యార్హత:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఎదైనా గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ నుండి ప్రథమ శ్రేణిలో డీగ్రే పాసై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
జీతం :
ఎంపిక చేసిన అభ్యర్ధులకు ఎంపిక చేయబడిన పట్టణాన్ని బట్టి రూ.32,000 నుండి 35,200 వరకు వేతనం ఇవ్వబడుతుంది. ఇతర అలవెన్సులు అదనం .
వయోపరిమితి
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారి వయసు జులై 1 నాటికి 21 నుంచి 28 వరకు ఉండాలి . వయోపరిమితుల్లో సడలింపుల సమాచారం క్రింద ఇవ్వబడిన లింక్ లోని అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
రూ.800/- ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం
ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేయబడతారు.
LIC HFL ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?
అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా Online లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం lichousing.com లోగానీ క్రింద తెలిపిన లింకులో గానీ 14.08.2024 తేదీలోగా అప్లికేషన్లు పంపవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 25.07.2024
దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2024

