వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) మరియు ‘అమృత్ భారత్’ (Amrit Bharat) రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే బోర్డు కీలక ...

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) మరియు ‘అమృత్ భారత్’ (Amrit Bharat) రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే బోర్డు కీలక వెసులుబాటు కల్పించింది. ఈ రైళ్లలో అత్యవసర కోటా (Emergency Quota – EQ) ను పునరుద్ధరిస్తూ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది.

భారతీయ రైల్వే బోర్డు 2024లో జారీ చేసిన కమర్షియల్ సర్క్యులర్ నం. 25 ప్రకారం, వందేభారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ (High Official Requisition – HOR) ను పూర్తిగా రద్దు చేసింది. సాధారణ ప్రయాణికులకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అత్యవసర సమయాల్లో ప్రజాప్రతినిధులు, విఐపీలు, మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడే రోగులకు సీట్లు దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో, రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని పున సమీక్షించుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ రెండు ప్రీమియం రైళ్లలోనూ ఎమర్జెన్సీ కోటాను తిరిగి ప్రవేశపెట్టారు. జోనల్ రైల్వేల అభ్యర్థనలు మరియు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి.

సామాన్యుల రైలుగా పిలవబడే ‘అమృత్ భారత్’ రైళ్లలో కూడా ఈ కోటా వర్తిస్తుంది. దీంతో దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో వెళ్లే సామాన్య ప్రజలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ కోటా ద్వారా టికెట్లు పొందే అవకాశం లభిస్తుంది.

Join WhatsApp Channel