ఈ ఆర్టికల్ లో వరలక్ష్మీ వ్రతం పూజా విధానం చెప్పబడినది. అలాగే వరలక్ష్మీ వ్రతం పుస్తకం కూడా ఇవ్వబడినది.
శ్రావణమాసం వచ్చేసింది అనగానే అనేక పండుగలు మొదలవుతాయి. వాటిల్లో మొదట వచ్చేది భారతీయ స్త్రీలు ఎంతో ఇష్టంగా.. వైభవంగా జరుపుకునే పండుగ “శ్రీ వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham)”.
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయం. ఆ రోజున వీలుకాని వాళ్ళు తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలి , పూజా సామగ్రి, వ్రత కథ, పూజా విధానం (Varalakshmi Vratham Pooja VIthanam & katha) ఈ ఆర్టికల్ లో చూద్దాం!
హిందూ స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరిందట. అప్పుడు పరమశివుడు వరలక్ష్మీ వ్రతాన్ని గురించి తెలిపినట్లు వేదపండితులు తెలుపుతున్నారు. ముత్తైదువులు అందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు.
వరలక్ష్మీ వ్రత విధానము
వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజ గదిలో కానీ గదిలో ఒక మూలగానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఈమండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని, పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి.
కావలసిన వస్తువులు
పసుపు, కుంకుమ, ఎర్రటిజాకెట్టు బట్ట, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరానికి అవసరమైన దారము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, శనగలు.
తోరం ఇలా తయారు చేసుకోవాలి
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠంవద్ద ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలనుపూజించాలి. ఈవిధంగా తోరాలను పూజించిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి.
వ్రతం మొదలెత్తే ముందు మండపంలో వెనుకవైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని గానీ, విగ్రహాన్ని గానీ ప్రతిష్టించుకోవాలి. (బంగారు, వెండి, రాగి) చెంబును శుభ్రంగా తోమి, పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పరచుకొని, కొత్త జాకెట్టు గుడ్డను కలశంలో పరచుకుని, కొబ్బరికాయకు పసుపురాసి కుంకుమబొట్టు పెట్టి కలశంపై పెట్టుకోవాలి.
ప్రతీ పూజలోనూ తప్పకుండా ముందుగా గణపతిని పూజించాలి. (క్రింద క్లుప్తంగా ఇవ్వబడింది.. ఒకవేళ పూర్తి వినాయక పూజ కోసం వినాయక వ్రత పూజ చూడండి)
గణపతి పూజ : ఓం శ్రీగురుభ్యోన్నమః మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః, హరిహిఓమ్, దేవాంచ మజనయంత దే వాస్తాం విశ్వరూపా. పశవోవదంతి! సానోమంద్రేష మూర్ఖం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు! అయం ముహూర్త సుముహూర్తోఅస్తూ!! యశ్శివో నామ రూపాభ్యాం యదేవి సర్వమంగళా ! తయోసంస్మరణాత్పుమ్సాం సర్వతో జయమంగళం !!
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో పశాంతయే!!
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మీపతే తండ్రియుగంస్మరామి!!
యత్రయోగీశావర కృష్ణో యత్రపార్టీ ధనుద్ధరః !
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ !!
స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే !
పురుషస్తమజంనిత్యం వాజామినరణం హరిం !!
సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం !
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయత్నం హరిం ! ఒ
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః !!
యేశామింది వరష్యామో హృదయస్తో జనార్ధనః !
అపదామప హర్తారం దాతారం సర్వసంపదాం !!
లోకాభిరామం శ్రీరామం భూయోభూయోనమామ్యాహం !!
సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికి!
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే!!
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోగిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ కృష్ణ పరబ్రాహ్మణే నమః
ప్రాణాయాయం
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే, ఓం భూః ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం తపః ఓం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం మాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర వుద్దిస్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే బహ్ర్ వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరే, … ఆయనే, … మాసే, … పక్షే, … తిధౌ, వాసరే శుభయోగే సంవత్సరము పేరు శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః … నామధేయః (ధర్మపత్నీ సమేతః) మమ ధర్మార్థ కామోమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం సత్ననాన సౌభాగ్యఫలావాప్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగత్వేన కలశపూజాం కరిష్యే. (అని సంకల్పము చేసుకొని పాత్రను గంధము అద్దికుంకుమ బొట్టుపెట్టి నీటిలో గంధము పుష్పము అక్షతలువేసి కుడిచేతితో కలశము పట్టుకొని)
కలశారాధన
శ్లో॥ కలశస్య ముఖేవిష్ణు కంఠే రుద్రః సమాశ్రితాః
మూలే తత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతః
కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరాః
ఋగ్వేదోథ యజుర్వేదః సామవేదో హృదర్వణః
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః
అయాన్తు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయకారకాః
శ్లో॥ కల్యాణీ కమలానిలయే కామితార్థ ప్రదాయిని
యావత్వాం పూజయిష్యామి శుభదే ప్రదాయిని
గంగేచ యమునేచైవ గోదావరి, సరస్వతీ
నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.
శ్రీ వరలక్ష్మీ పూజ ప్రారంభము
శ్లో॥ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతా భవసర్వదా
క్షీరోదార్ణవసమ్భూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే.
శ్రీవరలక్ష్మీ దేవతాం ధ్యాయామి.
సర్వమంగళమాఙ్గల్యే విష్ణువక్షఃస్థలాలయే
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవసర్వదా.
శ్రీవరలక్ష్మీదేవతా మావాహయామి.
సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం
సింహాసనమిధం దేవి స్త్రీయతాం సురపూజితే,
శ్రీవరలక్ష్మీదేవతాయై రత్నసింహాసనం సమర్పయామి.
శుద్ధోదకం ప్రాతస్థం గన్ధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే.
శ్రీవరలక్ష్మీ దేవతాయై అర్ఘ్యం సమర్పయామి.
సువాసితజలం రమ్యం సర్వతీర్ధసముద్భవం
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవనమస్కృతే.
శ్రీవరలక్ష్మీ దేవతాయై పాద్యం సమర్పయామి.
సువర్ణకలశానీతం చన్దనాగరుసంయుతం
గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే.
శ్రీవరలక్ష్మీ దేవతాయై ఆచమనీయం సమర్పయామి.
పయోదధిమృతోపేతం శర్కరామధుసంయుతం
పజ్చామృతస్నానమిదం గృహాణ కమలాలయే
వరలక్ష్మీ దేవతాయై పంచామృతస్నానం సమర్పయామి
గజ్జజలం మయా … నీతం మహాదేవశిరఃస్థితం
శుద్ధోదకస్నానమిదం గృహాణ విధుసోదరి.
శ్రీవరలక్ష్మీ దేవతాయై స్నానం సమర్పయామి.
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి.
సురార్చితాంఘ్రయుగళే దుకూలవసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయై వస్త్రయుగ్మం సమర్పయామి.
కేయూరే కంకరాది దివ్యే హారనూపురమేఖలాః
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నానాఆభరణాని సమర్పయామి.
తప్తహేమకృతం దేవి గృహాణ త్వం శుభప్రదే
ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభప్రదే.
శ్రీవరలక్ష్మీ దేవతాయై యజ్ఞోపవీతం సమర్పయామి.
కర్పూరాగరుకస్తూరీరోచనాదిభిరన్వితం గన్ధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్.
శ్రీవరలక్ష్మీదేవతాయై గంధాన్ ధారయామి..
అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాంస్తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే.
శ్రీవరలక్ష్మీదేవతాయై అక్షతాన్ సమర్పయామి.
మల్లికాజాతికుసుమైశ్చంపకైర్వకర శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే.
శ్రీవరలక్ష్మీ దేవతాయై పుష్పైః పూజయామి.
అథాంగ పూజా
చంచలాయై నమః పాదౌ పూజయామి చపలాయై నమః జానునీ పూజయామి పీతామ్బరాయై నమః ఊరూ పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదన మాత్రే నమః స్తనౌ పూజయామి లలితాయై నమః భుజద్వయం పూజయామి కమ్బుకంర్యై నమః కణం పూజయామి సుముఖాయై నమః ముఖం పూజయామి శ్రియై నమః ఓష్ఠా పూజయామి సువాసికాయై నమః నాసికాం పూజయామి సునేత్ర్యై నమః నేత్రే పూజయామి రమాయై నమః కరౌ పూజయామి కమలాయై నమః శిరః పూజయామి వరలక్ష్మ్యై నమః సర్వాణ్యఙ్ఞాని పూజయామి.
వరలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణు పత్న్యై నమః
ఓం లోక శోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోక మాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖియై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మ మాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్య గంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్ర వదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్ర సహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓం వరలక్ష్మె్ నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
దశాబ్దం గుగ్గులూపేతం సుగన్ధం చ మనోహరం
ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణతమ్.
శ్రీవరలక్ష్మీదేవతాయై ధూపమాఘ్రాపయామి.
ఘృతాక్తవర్తిసంయుక్తమన్ద
దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ.
శ్రీవరలక్ష్మీ దేవతాయై దీపం సమర్పయామి.
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్యసంయుతం
నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై ధూపదీపానన్తరం ఆచమనీయం సమర్పయామి.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నైవేద్యం సమర్పయామి.
ఘనసారసుగన్దేన మిశ్రితం పుష్పసిం
పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరమ్.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై పానీయం సమర్పయామి.
పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణసంయుక్తం తామ్బూలం ప్రతిగృహ్యతామ్.
శ్రీవరలక్ష్మీ దేవతాయై తామ్బూలం సమర్పయామి.
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే.
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా.
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మస్త్రపుష్పం సమర్పయామి.
యానికాని చ పాపాని జన్మాన్తరకృతాని చ
తానితాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే.
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి.
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాంకృపయాదేవిశరణాగత
వత్సలే అన్యధాశరణంనాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధని.
నమస్త్రైలోక్యజనని నమస్తే విష్ణువల్లభే
త్రాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమస్కారాన్ సమర్పయామి.
అథ (నవసూత్ర) తోరగ్రంథిపూజా:
(తోరపుముళ్లను పూజించుట, ఈ తోరమునకు
తొమ్మిది ముడులుండవలెను. ఒక్కొక్క ముడియు తెలియునట్లు విడిగా నుంచి ఒక్కొక్క ముడిని
పూజింపవలెను గాని కుప్పగా పెట్టగూడదు.)
కమలాయైనమః ప్రథమగ్రన్జిం పూజయామి రమాయై నమః ద్వితీయ గ్రం
పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రం పూజయామి విశ్వజనన్యై నమః చతుర్ద
గ్రం పూజయామి మహాలక్ష్మ్యై నమః పణ్చమ గ్రన్జిం పూజయామి క్షీరాబ్ధి తనయాయై
నమః షష్ఠ గ్రన్ధిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రం పూజయామి చన్దసోదర్యై
నమః అష్టమ గ్రన్ధిం పూజయామి హరివల్లభాయై నమః నవమ గ్రన్ధిం పూజయామి.
ఈ క్రింది శ్లోకము చదువుచూ తోరము కట్టుకొనవలెను.
బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే.
వాయనమిచ్చు దానము :
ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే
ఇందిరా ప్రతిగృహ్లాతు ఇందిరా వై దదాతి చ
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః
శ్రీ వరలక్ష్మీ వ్రత కథ
సకల మునిగణంబులతోగూడి రమ్యమైయున్న కైలాస పర్వతశిఖరంబున నానావిధంబు లగు మణులు చెక్కినదియు, పాటలములు, అశోకములు, సురపొన్నలు, ఖర్జూరములు, పొగడలు, మొదలగు పెక్కు వృక్షములతో గూడినదియునై, కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయి యుండు కల్పవృక్షపుజేరువ, రత్నమయమైన సింహాసనమునందు నింపుగా గూర్చుండియున్నట్టి జనులకు సుఖముల గలిగించువాడయిన శంకరునిజూచి, పార్వతీదేవి కడుముదమంది “సకలలోకంబుల నేలుచు సకల భూతములందును దయగలిగియుందునట్టి యోనాథుడా రహస్యమయి పావనమయిన యొక శుభవ్రతంబును నాకు దెల్పుము”అని లోకముల మేలు కోరినదై యడిగెను. అంతట నీశ్వరుడు పార్వతికిట్లనియె ఓ పార్వతీ! వ్రతములలోనెల్ల నుత్తమ మయిన వ్రతమొక్కటి యున్నది. అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్రపౌత్రులను ఒసగునది. ఈ పావనవ్రతము వరలక్ష్మీ వ్రతమనబడును. ఈ వ్రతము శ్రావణ మాసంబు నందు పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడాచరింపవలెను. ఓపార్వతీ! ఆవ్రతము చేసిన స్త్రీకి గలుగు పుణ్య ఫలంబుజెప్పెద నాలకింపు”మని పార్వతికి పరమశివుడు చెప్పగా నా పార్వతీదేవియు వెండియు శంకరునిజూచి “నాథా! ఆవ్రతంబు నేవిధితో జేయవలెను? ఆ వ్రతంబు నందే దేవతను గొలువవలయును? ఆ వరలక్ష్మీదేవి నింతకు ముందెవరారాధించి యామెను సంతోషపెట్టిరి? అని యడుగగా నీశ్వరుడు పార్వతీదేవితో నిట్లనియె. ఈ కథను శౌనకాది మహామునులకు సూతపౌరాణికుడు చెప్పాడు. “స్త్రీలకు వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది. ఈ శుభకరమైన పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పాడు.
వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం రోజున చేయాలి” అని “ఓ పార్వతీ, వరలక్ష్మీ కథను చెబుతున్నాను. శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతీరోజు తెల్లవారు జామునే నిద్రలేచి స్నానాదులు పూర్తిచేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలను సేవిస్తూ, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒక రోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి “నేనమ్మా వరలక్ష్మీదేవిని. నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకుముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను” అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి “నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే ఓ జగన్మాతా! నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు. విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శనభాగ్యం కలిగింది. ఇకనా జన్మధన్యమైంది” అంది కలలోనే.
చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధాన మైంది. చారుమతి నిద్రనుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది. కలలో తనకు వలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామల ఉను, ఇరుగుపొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణమాసం రాగానే వరలక్ష్మీవ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు.
కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారు జామునే లేచి స్నానాదులు పూర్తిచేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజగదిలో పీటవేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటుచేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు.
ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలసి “పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవసర్వదా” అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తిచేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది. పలురకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది.
ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తికాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో ఘల్లుఘల్లు మనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్లవైపు చూసుకున్నారు. వారి కాళ్ళకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీ దేవి కటాక్షమేనని చారుమతి, మిగిలిన స్త్రీలు చాలా సంతోషిం చారు.
రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభర ణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తుగర వాహనాలతో, సౌభాగ్యంతో నిండిపోయింది.
వ్రతంలో పాల్గొన స్త్రీలను తీసుకుపోవటానికి గుర్రాలు, ఏనుగులు రధాలు వచ్చి చారుమతి ఇంటివద్ద నిలిచాయి. తమచేత శాస్త్రప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్త ముని గంధం, పుష్పాలతో పూజించారు. దక్షిణ, తాంబూలము, పన్నెండు భక్ష్యములు వాయనం ఇచ్చి ఆశీర్వాం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధవులతో కలసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
ఆ రోజునుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీ దేవిని పూజిస్తూ, సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారూ చేయవచ్చు. ఈ కథను విన్నవారికీ, చదివిన వారికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగు తాయి. ఇది సౌభాగ్య దాయకం, సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది.” అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. (ఈకథ అనంతరం అక్షతలు శిరుస్సున ధరించి పసుపుకుంకుమలను గడప మధ్యలో పెట్టాలి.)
Varalakshmi Vratam Pooja Book PDF – Click Here
Varalakshmi Vratam Pooja Vidhanam PDF – Click Here