Sankashti Chaturthi 2024: జులై 24 ఆషాడ సంకటహర చతుర్థి.. ఎలా చేయాలి, గణేశ పూజా విధానం

సంకష్టి చతుర్థి లేదా సంకటహర చతుర్థి, అనేది హిందూ క్యాలెండర్‌లోని ప్రతి చంద్ర మాసంలో వచ్చే పవిత్రమైన పండుగ. ఈరోజున గణేశుని కొలుస్తారు. ప్రతీ నెలా పౌర్ణమి తర్వాత కృష్ణ పక్షంలో ప్రతి 4వ రోజు ఈ చతుర్థి వస్తుంది.

ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే, దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు.ఇది అన్ని సంకటహర చతుర్థి రోజులలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ఆషాఢ మాసంలో కృష్ణ పక్ష సంక్షా చతుర్థి వ్రతాన్ని ఆషాఢ సంకాశ చతుర్థి లేదా గజాన సంకాశ చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున విఘ్నాలను తొలగించే గణేశుడిని పూజించడం వల్ల మనిషికి ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని మరియు మనిషికి ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.

‘సంకష్టి’ అనే సంస్కృత పదానికి ‘కష్ట సమయాల్లో విముక్తి’ అని అర్ధము ఉంది. ‘చతుర్థి’ అంటే ‘నాల్గవ రోజు’ అదే చవితి. కాబట్టి, ఈ శుభప్రదమైన రోజున, భక్తులు జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు ప్రతి క్లిష్ట పరిస్థితిలో విజయం సాధించడంలో సహాయపడటానికి గణేశుడిని పూజిస్తారు.

ఈరోజు ఆషాఢ సంకష్టి చతుర్థి: తిథి ఎప్పుడు వచ్చిందంటే

జూలై 24 న ఆషాడ సంకష్టి చతుర్థి వచ్చింది. హైదరాబాద్ లో ఈ తిథి సమయాలు చూద్దాం.

చతుర్థి తిథి ప్రారంభ సమయం – జూలై 24, 7:30 ఉదయం
చతుర్థి తిథి ముగింపు సమయం – జూలై 25, 4:40 ఉదయం
చంద్రోదయం సమయం – జూలై 24, 9:40 రాత్రి
చంద్రాస్తమయం సమయం – జూలై 25, 9:45 ఉదయం

సంకటహర చతుర్థి ఆచారాలు

సంకటహర చతుర్థి రోజున, భక్తులు తెల్లవారుజామున లేచి గణేశుడిని ఆరాధిస్తారు. కొందరైతే కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. పాక్షిక ఉపవాసాన్ని కూడా పాటించవచ్చు.. పాక్షిక ఉపవాసంలో పండ్లు, ద్రవాలను మాత్రమే సేవిస్తూ రోజంతా గణేశుని ఆరాధనలో ఉంటారు. అదీ కుదరని వారు ‘గణేశ అష్టోత్రం’, ‘సంకష్టనాశన స్తోత్రం’ మరియు ‘వక్రతుండ మహాకాయ’ లాంటి స్తోత్రాలు పఠిస్తూ సాయంత్రం చంద్రుని దర్శనం తర్వాత సంకష్ఠి పూజ చేస్తారు.

నిజానికి ఈ పూజలో ప్రతి నెలకు ఒకటి, 13వ కథ అధికమాసం కలిపి మొత్తం 13 వ్రత కథలు ఉన్నాయి. ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటంటే, ఆ మాసానికి సంబంధించిన కథను మాత్రమే పారాయణం చేయాలి అంటారు.

ప్రతి నెల సంకష్టి గణపతి పూజ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

హిందూ చంద్ర మాసంవినాయకుని పేరుపీఠం పేరు
చైత్ర మాసంవికట మహా గణపతివినాయక పీఠం
వైశాఖ మాసంచనక్ర రాజా ఏకదంత గణపతిశ్రీచక్ర పీఠం
జేష్ట మాసంకృష్ణ పింగళ మహా గణపతిశ్రీ శక్తి గణపతి పీఠం
ఆషాడ మాసంగజానన గణపతివిష్ణు పీఠం
శ్రావణ మాసంహేరంబ మహా గణపతిగణపతి పీఠం
భాద్రపద మాసంవిఘ్నరాజ మహా గణపతివిఘ్నేశ్వర పీఠం
ఆశ్వయుజ మాసంవక్రతుండ మహా గణపతిభువనేశ్వరి పీఠం
కార్తీక మాసంగణదీప మహా గణపతిశివ పీఠం
మార్గశిర మాసంఅకురాత మహా గణపతిదుర్గా పీఠం
పుష్య మాసంలంబోదర మహా గణపతిసౌర పీఠం
మాఘ మాసంద్విజప్రియ మహా గణపతిసామాన్య దేవ పీఠం
పాల్గుణ మాసంబాలచంద్ర మహా గణపతిఆగమ పీఠం
ఆదిక మాసంవిభువన పాలక మహా గణపతిదూర్వ బిల్వ పత్ర పీఠం

ఈ మాసం ఆషాడం కనుక “గజానన గణపతి”గా వినాయకుని పూజించాలి.

సంకటహర చతుర్థి పూజా విధానం

ఈ పూజలో, గణేశుడి విగ్రహాన్ని దుర్వ గడ్డి మరియు తాజా పూలతో అలంకరించి. దీప, ధూపాలతో వేద మంత్రాలను పఠిస్తూ గణపతి పూజ నిర్వహిస్తారు. వినాయకునికి ఇష్టమైన బెల్లంతో చేసిన కుడుములు లేదా పాయసం నివేదిస్తారు.

అనంతరం చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. సంకష్టి చతుర్థి రోజున, ప్రత్యేక పూజ ఆచారాలు చంద్రునికి కూడా చేస్తారు. చంద్ర దర్శనం సమయంలో చంద్రుని దిశలో నీరు, గంధపు నీరు, బియ్యం మరియు పువ్వులు చల్లుతారు.

ఆషాఢ సంకష్ట చతుర్థి శుభాకాంక్షలు 2024

sankatahara chaturdhi subhakankshalu
sankatahara chaturdhi subhakankshalu
Join WhatsApp Channel