EeVela Sunday, October 18, 2026
trending
LIVE UPDATES

AP Local Elections 2026 Live: నామినేషన్లకు ఈరోజే చివరి రోజు … పలు చోట్ల ఉద్రిక్తతలు

LIVE

Live updates

ఈ వార్తకు సంబంధించిన ప్రస్తుత పరిణామాలు...లైవ్

Checking for new updatesLast update: 12:45
10 hours agoBy Eevela Desk

జమ్మలమడుగులో ఉద్రిక్తత

కడప జిల్లా జమ్మలమడుగులో నామినేషన్ వేద్దామనుకున్న రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

12 hours agoBy Eevela Desk

ఇచ్చాపురం మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ టీడీపీలోకి మాజీ కౌన్సిలర్లు

స్థానిక పురపాలక సంఘంలో గట్టి పట్టున్న సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్స్ ఒకేసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ గూటికి చేరడంతో పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.

12 hours agoBy Eevela Desk

వానలో తడుస్తూనే దీక్ష

తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద పగటిపూట నామినేషన్ వేయకుండా తీవ్ర ఆటంకాలు ఎదుర్కొన్న వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి ఎచ్చెం వాసుదేవ యాదవ్ (వాసు యాదవ్).. కురుస్తున్న జోరు వానను సైతం లెక్కచేయకుండా తన తల్లి రేణుకా యాదవ్‌తో కలిసి అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపైనే బైఠాయించి ‘గాంధీ గిరి’ శైలిలో శాంతియుత పోరాటానికి దిగారు.

13 hours agoBy Eevela Desk

వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హౌస్‌ అరెస్ట్‌

వినుకొండ మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి వైసీపీ తరఫున పీఎస్‌ ఖాన్‌ ఆదివారం నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

13 hours agoBy Eevela Desk

నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొలి అడుగు

నంద్యాల నియోజకవర్గంలో 50వ వార్డు అభ్యర్థిగా తాతిరెడ్డి రేణుకారెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు

13 hours agoBy Eevela Desk

Vijayawada Mayor Election: ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును పోటీ చేయాలని ఇండియా కూటమి కోరింది. ఆ పార్టీలు కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. తన నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని నగర ప్రజలను కోరారు. ఏబీకి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.

13 hours agoBy Eevela Desk

కర్నూలు మేయర్ పీఠం – అత్తా Vs కోడలు

కర్నూలు మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ తరఫున బొల్లెద్దుల ప్రత్యూష, వైసీపీ తరఫున ఉతకల్ల సుశీల పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ ప్రత్యర్థిత్వం ఉన్నప్పటికీ, కుటుంబపరంగా దగ్గరి సంబంధం ఉంది. ప్రత్యూష సోదరి ప్రియాంకను సుశీల కుమారుడు భార్గవ్ వివాహం చేసుకున్నారు. ఈ బంధం కారణంగా సుశీల, ప్రత్యూషకు అత్త అవుతారు. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు మేయర్ పీఠం కోసం పోటీ పడుతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

క్రొత్త సమాచారం రాగానే మీకు అందిస్తాం