ప్రతీకార రాజకీయాలతో కొట్టుమిట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు అని జడ శ్రావణ్ అన్నారు. ఓక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా రెడ్ బుక్ రాజకీయాల వల్ల ఎదుటిపార్టీ వారిపై దాడులు తప్పవని .. దీనివల్ల క్రొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు అని అన్నారు.
ఇదే ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తేగల సత్తా కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉందని, దక్షిణ భారత దేశంలో ప్రధాని మోడీతో సత్సంబంధాలు కల ఒకే ఒక నాయకుడు పవన్ అని అన్నారు.
అలాగే.. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రచారంలో తాను లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురాగలను అని అన్నారని.. అలాగే కేంద్రం పార్లమెంట్ లో ఏమి చెప్పినా .. 30,000 మంది మహిళల అదృశ్యం అయ్యారన్న పవన్ మాటలను తాను నమ్ముతున్నాను అని.. వారి ఆచూకీ తెలుసుకునే దిశగా ఆయన ప్రయత్నించాలి అని జడ శ్రావణ్ అన్నారు.
జగన్ పై మాట్లాడుతూ కమ్మ వారందరూ జగన్ కు వ్యతిరేకంగా పనిచేసి ఓడించారు అని.. అంతే కాదు .. జగన్ మోహన్ రెడ్డి ఓటమికి జగన్ మాత్రమే కారణం అని .. తన ఫ్యూడల్ భావజాలంతో .. ప్రవర్తించారు అని.. చెప్పారు.
ఈ ఇంటర్వ్యూ పూర్తి భాగం క్రింది వీడియో ద్వారా చూడవచ్చు.