వైసీపీతో పాటూ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ తాను, తనతో పాటూ బీడ మస్తాన్ రావు తెలుగుదేశంలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడానికి చాలా కారణాలు ఉన్నాయని అవి బయటికి చెప్పలేను అని చెప్పారు.
అయితే వైసీపీ అధినేత జగన్ పై కూడా మాట్లాడారు.. వైఎస్సార్, ఆయన తనయుడు జగన్ పేద ప్రజలకు ఏదో చేయాలి అని తపన ఉన్నవారే అని.. అయితే కొన్ని పరిపాలనా సంబంద తప్పులు జరిగిన మాట వాస్తవమే అని .. తనపై ఏ ఒత్తిడీ లేదు అని కొన్ని కారణాల వల్ల పార్టీ మారుతున్నానని చెప్పారాయన.
తనకు రాజ్యసభ పట్ల ఆసక్తి లేదని, త్వరలో స్థానిక రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని మోపిదేవి తెలిపారు. తాను ఓడినా జగన్ ఎంతో చేశారు అని కొందరు అంటున్నారని.. అటువంటి వారు తాను జగన్ కోసం ఎన్ని త్యాగాలు చేశానో కూడా గుర్తు చేసుకోవాలని చురక అందించారు. ఎక్కడో ఉండి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవారు. ఒకసారి తన నియోజకవర్గానికి వచ్చి చూస్తే తాను ఎందుకు పార్టీ మారుతున్నానో అర్ధం అవుతుంది అని చెప్పారు.