మొత్తానికి ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారిగా నిన్న కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాట్లు జరిగాయి. బుధవారం జగన్ .. తనను కలుసుకోడానికి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులను ఒక్కొక్కరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, తోడుగా ఉంటుందని ఉంటుందని భరోసా ఇచ్చారు.
అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. కొందరు కార్యకర్తలు తమకు ఎదురైన నష్టాలు, ఇబ్బందుల గురించి ఆయనకు వివరించగా … రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఆయన ఆయన ప్రజలను ఇలా వ్యక్తిగతంగా కలవలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక, జగన్ జనాన్ని రోజూ కలవడానికి పార్టీ ఏర్పాట్లు చేసింది. చూడాలి మరి ఈ మూలాఖాత్ లు రాబోయే ఐదేళ్ళూ కొనసాగుతాయో లేదో!