దువ్వాడ శ్రీనివాస్ ఉదంతంలో ముఖ్య భూమిక పోషిస్తున్న దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. స్కోడా కారును వేగంగా నడుపుతూ ముందు ఆగిఉన్న కారుని ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి.
ఆమె స్వంతంగా డ్రైవింగ్ చేస్తూ పలాస దగ్గర లక్ష్మీ పురం టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న కారుని వేగంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. మాధురికి గాయాలు కాగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు తర్వాత ఆమె చికిత్సకు నిరాకరస్తూ .. తాను సూసైడ్ చేసుకునే ఉద్దేశంతో హైవే పైకి వచ్చానని, దువ్వాడ వాణి తన పిల్లలపై చేసిన ఆరోపణలను తట్టుకోలేక చనిపోదామని అనుకుంటున్నానని.. చెప్పారు.
అయితే ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది.