“అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని జీతం తీసుకుని ప్రజలకోసం పని చేయరా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థకు పెరాలిసిస్ వచ్చనది అని గత ఐదేళ్లు పని చేయకుండా మానేశారు అని అటువంటి అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయి అని ఆయన హెచ్చరించారు.
సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జక్కంపూడిలో ఒక అధికారిని సస్పెండ్ చేసిన చంద్రబాబు మంత్రులైనా సరిగా పనిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాను అని అన్నారు.
ప్రజలు కూడా సంయమనంగా ఉండాలి అని మీ దగ్గరికే ఆహార పదార్ధాలు వస్తాయి అని అర్ధం చేసుకోవాలి అని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ మధ్యలోకి వచ్చిన బోట్స్ విషయంలో కుట్ర కోణం ఉంది అని అనుకుంటున్నాను అని.. అది ఎవరనేది దొరికితే తీవ్ర చర్యలు ఉంటాయి అని ఆయన హెచ్చరించారు.
బాబాయిని చంపి తెల్లారేక నారాసుర రక్త చరిత్ర అంటూ అన్నవారు కుట్రలు చేస్తున్నారు అని.. ఒకవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే గుడ్లవల్లేరు అంశంలో రాద్దాంతం చేస్తున్నారు అని, హాస్టళ్లలో విషాహారం .. లాంటి సంఘటనలు చూస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయని త్వరలో అవి అన్నీ బయట పెడతాం అని చంద్రబాబు వైసీపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.