దేశమంతా ఒక ఎత్తు .. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకో ఎత్తు..
- హోరా హోరీ ప్రచారాలు
- ఎన్నికల రోజు భారీ పోలింగ్
- ఎన్నికల తర్వాత హింస
- ఎన్నికల కమిషన్ క్రొత్త రూల్స్
- ఎటూ తేల్చని ఎగ్జిట్ పోల్ సర్వేలు
ఇలాంటి ముఖ్య సంఘటనలు జరిగాక ఇక కౌంటింగ్ కు గంటల్లోనే సమయం. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. అరగంటలో మొదటి ఫలితం ..
ఏపార్టీ గెలిచినా మెజార్టీ తక్కువగానే ఉండబోతున్నదనే వార్తల నేపద్యంలో అటు వైసీపీ అధినేత జగన్, ఇటు చంద్రబాబు అప్రమత్తమయ్యారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని అందించారు. ఈ
ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్పూర్తిని
చాటారన్నారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్పూర్తిని
కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమకు వేసిన ప్రతి ఓటును వైఎస్ఆర్సీపీ
ఖాతాలో పడేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తద్వారా తమ పార్టీకి
అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానన్నారు.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ… ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024
ఇకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా వైసీపీ గెలవబోతోందని, సంబరాలకు సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మరోవైపు చంద్రబాబు కౌంటింగ్ ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ఏజెంట్లు సంయమనం పాటించాలని,
అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి
ముందే కేంద్రాలను వెళ్లాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్ల
లెక్కింపు పూర్తయే వరకూ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని తెలిపారు. పోల్ అయిన
ఓట్లు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలని పేర్కొన్నారు. అన్ని
రౌండ్లు పూర్తి అయినా ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్లను లెక్కిస్తారని, ఏ
అనుమానం వచ్చినా ఆర్వోకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుకు సంబంధించి
ఎకనాలెడ్జ్‌మెంట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఎన్నికల
నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అనుమానాలు, అభ్యంతరాలపై అధికారులు
తెలపాలన్నారు. అనారోగ్యకారణాలతో ఏజెంట్ కౌంటింగ్‌కు వెళ్లలేకపోతే
అంతకుముందే మరొకరిని పంపించాలని చంద్రబాబు కోరారు.