29.2 C
Hyderabad
Thursday, February 12, 2026
HomeAndhra PradeshAnchor Syamala: వైసీపీ అధికార ప్ర‌తినిధిగా శ్యామల

Anchor Syamala: వైసీపీ అధికార ప్ర‌తినిధిగా శ్యామల

యాంక‌ర్‌, బిగ్‌బాస్ ఫేం ఆరె శ్యామ‌ల గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి ప్రచారం కూడా చేశారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో జనసేన-టిడిపి లపై చేసిన వ్యాఖ్యలతో ఆయా పార్టీల అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ధైర్యంగా అదే వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నారు. జగన్ అంటే అమితంగా అభిమానించే ఆమెకు పార్టీ అధినేత వైఎస్ జగన్ భారీ ఆఫర్ ఇచ్చారు.

తాజాగా ఆమెను వైసీపీ అధికార ప్ర‌తినిధిగా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు, ఆర్కే రోజాలతో పాటు నియ‌మించారు. ముగ్గురు సీనియర్లతో పాటు ఆమెని నియమించడం ఆమెకు జగన్ ఇచ్చిన గుర్తింపును తెలియచేస్తుంది.

శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహారెడ్డి క‌డ‌పకు చెందిన వారు. శ్యామ‌ల కోస్తా జిల్లాల స‌నాత‌న బ్రాహ్మ‌ణ అమ్మాయి. శ్యామ‌ల భ‌ర్త సినీ రంగంలో ప‌ని చేస్తున్నారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ గ్లామ‌ర్ రంగంలో ప‌ని చేస్తున్నారు. వైసీపీ త‌ర‌పున ప‌ని చేస్తే అవ‌కాశాలు పోతాయ‌నే భ‌యం లేకుండా ధైర్యంగా వైసీపీ ప్రచారంలో పాల్గొన్న ఆమె పిఠాపురం ప్రచారంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కూడా విమర్శించారు. టీడీపీ, జ‌న‌సేన సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు శ్యామ‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ట్రోలింగ్ చేసినా వాటిని లెక్క చేయ‌లేదు.

వైసీపీ పార్టీ ప్ర‌తినిధిగా శ్యామ‌ల ఎలా ముందుకుపోతారో.. చూడాలి మరి!

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel