ఏపిలో బిజెపి హామీ "కాపు" సీయం?

ఏపిలో బిజెపి హామీ "కాపు" సీయం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జలక్ ఇచ్చేందుకు బిజెపి రెడీ అయింది. తెలుగుదేశంతో పొత్తుతో అసంతృప్తిగా ఉన్న కాపు వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా రాష్ట్రంలో పావులు కదుపుతోంది. కాపు ముఖ్యమంత్రి నినాదంతో పాటు పలువురు కాపు పెద్దలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది.

రెండురోజుల క్రితం హైదరాబాద్ శికార్లలో రహస్య సమావేశం జరిగినది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు బయటికి రాకుండా అధినాయకత్వం జాగ్రత్త పడింది. కేవలం బిజెపి రాష్ట్ర నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తో పాటు 10 మందిని మాత్రమే ఆ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీలోని టిడిపి అనుకూల నాయకులకు ఆహ్వానాలు అందలేదు. కానీసం వారికి సమాచారం కూడా లేదు.

అధిష్టానం నుంచి వచ్చిన శివ ప్రకాశ్ జీ నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు నేతలు టిడిపి-జనసేన పొత్తు, సీట్ల ప్రకటన, చంద్రబాబు తీరు, ఎన్డీఏ లో చేరే విషయంలో నాన్చుడు ధోరణి వల్ల ఆంధ్రప్రదేశ్ లో బిజెపి తీవ్రంగా నష్టపోతున్నదని వాపోయారు. ఈ సమావేశ వివరాలను కేంద్ర అధినాయకత్వానికి వివేదించారు శివ ప్రకాశ్.

ఇక సంచలన నిర్ణయం తీసుకునేందుకు సమయం అనుకూలంగా ఉందని మోడీ-షా ద్వయం భావించినట్లు విశ్లేషకులు చెపుతున్నారు.

ఇదే జరిగితే రాష్ట్రంలో టిడిపి- జనసేన పార్టీల కూటమికి అతి పెద్ద దెబ్బే.

Join WhatsApp Channel