తిరువనంతపురం: సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చి లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెనుక భారీ కుట్ర దాగి ఉందని భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది కేవలం ఒక మీమ్ పేజీ లేదా వ్యంగ్య రాజకీయ పార్టీ కాదని.. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు సరిహద్దులు దాటి జరుగుతున్న ‘ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్’ అని కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశాలపై దాడులు చేయడానికి ఆయుధాలు అవసరం లేదని, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లతో కూడిన ఫేక్ నెట్వర్క్లను అస్త్రాలుగా వాడుతున్నారని రాజీవ్ చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. “విదేశీ శక్తులు మరియు వారికి సహకరించే కొన్ని స్వదేశీ రాజకీయ పార్టీలు ఏకమై, ఇలాంటి నకిలీ ఆపరేషన్ల ద్వారా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్నాయి” అని విమర్శించారు.



